తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uttarakhand Cm Dhami At Htls 2022: త్వరలో ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి

Uttarakhand CM Dhami at HTLS 2022: త్వరలో ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి

HT Telugu Desk HT Telugu

12 November 2022, 16:03 IST

    • Uttarakhand CM Dhami at HTLS 2022: రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code - UCC)ని అమలు చేయడం కోసం ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ - 2022(Hindustan Times Leadership Summit-2022)లో ఆయన పాల్గొన్నారు.
హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

Uttarakhand CM Dhami at HTLS 2022: ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీనే అతిపెద్ద ఆయుధమని ఉత్తరాఖండ్ సీఎం ధామి వ్యాఖ్యానించారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ - 2022(Hindustan Times Leadership Summit-2022)లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Uttarakhand CM Dhami at HTLS 2022: ఆ సంప్రదాయం బద్ధలవుతుంది..

ఓటర్లు అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వరనే సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోనే కాదు, ఉత్తరాఖండ్ లోనూ ఉందని ధామి గుర్తు చేశారు. అయితే, ప్రధాని మోదీ ప్రజాదరణతో ఆ సంప్రదాయాన్ని ఉత్తరాఖండ్ లో బద్ధలు కొట్టామని ఆయన తెలిపారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్ లోనూ ఆ సంప్రదాయం బద్దలవుతుందని, అక్కడ మళ్లీ బీజేపీ నే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Uttarakhand CM Dhami at HTLS 2022: త్వరలో యూసీసీ(Uniform Civil Code -UCC)

ఉత్తరాఖండ్ లోనూ త్వరలో ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code - UCC)ని అమలు చేస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. ప్రజలందరికీ అందరికీ ఒకే చట్టం అనే విధానానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code - UCC)ను అమలు చేయడం కోసం ముసాయిదాను సిద్ధం చేస్తున్నామన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల్లో కూడా ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code - UCC) అమలు కోసం బీజేపీ హామీ ఇవ్వడం సంతోషదాయకమన్నారు.

Uttarakhand CM Dhami at HTLS 2022: మోదీ ఆకర్షణ అసాధారణం

బీజేపీ గెలుపునకు ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాకర్షణ ఒక్కటి చాలని ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యానించారు. హిమాలయ రాష్ట్రాల్లో అభివృద్ధి కి ప్రధాని కట్టుబడి ఉన్నారన్నారు. అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ప్రజలు పట్టం కడతారని, అందుకు ప్రధాని మోదీనే ఉదాహరణ అని అన్నారు.

టాపిక్