తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manish Sisodia Alleges Bjp Conspiring To Kill Kejriwal: కేజ్రీవాల్ హత్యకు కుట్ర’

Manish Sisodia alleges BJP conspiring to kill Kejriwal: కేజ్రీవాల్ హత్యకు కుట్ర’

HT Telugu Desk HT Telugu

25 November 2022, 21:28 IST

  • Manish Sisodia alleges BJP conspiring to kill Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. 

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మనీశ్ సిసోడియా
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మనీశ్ సిసోడియా (ANI)

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మనీశ్ సిసోడియా

Manish Sisodia alleges: ఒకవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, ఆప్ లే. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు పదునెక్కుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Manish Sisodia alleges: కేజ్రీవాల్ హత్యకు కుట్ర

బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను అంతమొందించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ నేత, ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎఫ్ఐఆర్ తో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. గుజరాత్ లో, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని బీజేపీకి అర్థమైందని, అందువల్ల కేజ్రీవాల్ ను చంపాలని అనుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేత మనోజ్ తివారీ ఈ కుట్ర వెనుక ఉన్నాడని, గతంలో కూడా ఒకసారి కేజ్రీవాల్ ను చంపేస్తామని బెదిరించారని సిసోడియా ఆరోపించారు. ‘కేజ్రీవాల్ ను మనోజ్ తివారీ నిన్న బెదిరించారు. దీన్ని బట్టి కేజ్రీవాల్ ను హత్య చేయాడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది` అన్నారు. `కేజ్రీవాల్ పై ఎవరైనా దాడి చేయవచ్చు. ఎవరు చేశారని ఎలా తెలుస్తుంది?’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించిన విషయాన్ని సిసోడియా గుర్తు చేశారు. మనోజ్ తివారీ ని విచారించాలని డిమాండ్ చేశారు.

Manoj Tiwari response: కేజ్రీవాల్ భద్రత గురించే నా ఆందోళన

సిసోడియా ఆరోపణలపై బీజేపీ నేత మనోజ్ తివారీ స్పందించారు. ‘ఢిల్లీ సీఎం భద్రత గురించే నా ఆందోళన. వారి పార్టీ ఎమ్మెల్యేను కొట్టారు. వారి కార్యకర్త ఒకరు చనిపోయారు. అందుకే, కేజ్రీవాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాను. ఇక వారి మర్డర్ ఆరోపణలు కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అది వారికి కామనే’’ అని వ్యాఖ్యానించారు.