తెలుగు న్యూస్  /  National International  /  Man Rapes, Kills Girl To Avenge Affair Of His Wife With Child's Father

Man rapes girl : భార్య ప్రియుడిపై రివేంజ్​ కోసం- అతని బిడ్డను రేప్​ చేసి, చంపి!

29 November 2022, 10:31 IST

    • Man rapes girl : పొరుగింటి వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఓ వ్యక్తి.. అతనిపై కోపం పెంచుకున్నాడు. రివేంజ్​ తీర్చుకోవాలని భావించి.. ఆ వ్యక్తి కూతురిని రేప్​ చేసి, చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది.
భార్య ప్రియుడిపై రివేంజ్​ కోసం- అతని బిడ్డను రేప్​ చేసి, చంపి!
భార్య ప్రియుడిపై రివేంజ్​ కోసం- అతని బిడ్డను రేప్​ చేసి, చంపి!

భార్య ప్రియుడిపై రివేంజ్​ కోసం- అతని బిడ్డను రేప్​ చేసి, చంపి!

Man rapes girl : మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భర్త.. అతనిపై రివేంజ్​ తీర్చుకోవడం కోసం దారుణానికి ఒడిగట్టారు. పొరుగింటి వ్యక్తికి చెందిన ఏడేళ్ల కూతురిపై అత్యాచారం చేసి, చంపేశాడు.

ఇంత దారుణమా..!

31ఏళ్ల రాజేష్​ రాజక్​.. తన కుటుంబంతో కలిసి సత్నా జిల్లాలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతని భార్యకు.. పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొంత కాలం తర్వాత రాజేష్​కు తెలిసింది. పొరుగింటి వ్యక్తిని కలవొద్దు, మాట్లాడవద్దని చాలా సార్లు భార్యకు చెప్పాడు రాజేష్​. కానీ ఆమె, అతడిని కలుస్తూనే ఉంది.

Madhya Pradesh crime news : ఈ పరిణామాలతో.. ఆ వ్యక్తిపై కోపం పెంచుకున్నాడు రాజేష్​. అతనిపై రివేంజ్​ తీర్చుకోవాలని భావించాడు. సమయం చూసుకుని ఈ నెల 17న.. అతని ఏడేళ్ల బిడ్డను అపహరించాడు. సమీపంలోని అడవులకు తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారిని దారుణంగా హత్య చేసి, అడవుల్లో వదిలేసి వెళ్లిపోయాడు.

బిడ్డ కనిపించడం లేదంటూ.. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబసభ్యులు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరంగా సాగించారు. ఈ క్రమంలోనే సమీప అడవుల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడెవరు? అనే విషయం తెలుసుకునే క్రమంలో.. రాజేష్​పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని విచారించగా.. పోలీసుల ఎదుట నిజాన్ని ఒప్పేసుకున్నాడు.

"నా భార్యకు అతనితో సంబంధం ఉంది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. అందుకే రీవేంజ్​ తీర్చుకున్నా," అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.

నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 376, 302 కింద రేప్​, మర్డర్​తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితు కుటుంబానికి హామీనిచ్చారు.

కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం..

Man rapes daughter : దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 36ఏళ్ల వ్యక్తి.. సొంత కూతురిపై 3ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన గురుగ్రామ్​లో వెలుగులోకి వచ్చింది.

36ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో పాటు న్యూ పాలమ్​ విహార్​లో నివాసముంటున్నాడు. కాగా.. అతడికి 15ఏళ్ల కూతురు ఉంది. మూడేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఈ కిరాతకుడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో లైంగికంగా వేధిస్తున్నాడు. ఫలితంగా ఆమె మానసిక వేదనకు గురైంది.

అక్టోబర్​ 28న.. బాలికపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తండ్రి. ఆమె వెళ్లి.. తన స్నేహితుల వద్ద బాధ పడింది. అప్పుడే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

"ఆ స్నేహితురాలు.. తన తల్లితో ఈ విషయం చెప్పింది. అక్కడి నుంచి ఓ ఎన్​జీఓకు సమాచారం వెళ్లింది. గత వారం పోలీసుల దృష్టికి ఈ విషయం వచ్చింది. బాలికను ప్రశ్నించాము. తొలుత చాలా భయపడిపోయింది. ఆ తర్వాత జరిగినదంతా చెప్పేసింది," అని బంజేరా పోలీస్​ స్టేషన్​ అధికారులు వెల్లడించారు.

నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.