శివపురి (మధ్యప్రదేశ్), నవంబర్ 17: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడినందుకు బస్సు కండక్టర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు.,బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరగగా, ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మాట్లాడుతూ ‘ఒక బస్సు కండక్టర్ మహిళను తప్పుదారి పట్టించాడు. బస్సు ఆమె దిగాల్సిన స్టాప్‌కు వెళ్తుందని ఆమెకు చెప్పాడు. కానీ బదులుగా ఆమెను మరొక ప్రదేశానికి తీసుకువచ్చాడు. కండక్టర్ చివరి స్టాప్‌లో మహిళపై రాత్రిపూట అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత వాహనం నుంచి తోసేశాడు..’ అని వివరించారు.,బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కండక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కండక్టర్‌పై ఐపీసీ 373, 367 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.,ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు పంపినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.