తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pune-bengaluru Highway Accident: హైవేపై భారీ రోడ్డు ప్రమాదం.. 40కుపైగా వాహనాలు ధ్వంసం!

Pune-Bengaluru highway accident: హైవేపై భారీ రోడ్డు ప్రమాదం.. 40కుపైగా వాహనాలు ధ్వంసం!

20 November 2022, 23:34 IST

    • Pune-Bengaluru highway accident: పూణెలోని ఓ బ్రిడ్జి వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 48 వరకు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
Pune-Bengaluru highway accident: బ్రిడ్జిపై భారీ రోడ్డు ప్రమాదం
Pune-Bengaluru highway accident: బ్రిడ్జిపై భారీ రోడ్డు ప్రమాదం (PTI)

Pune-Bengaluru highway accident: బ్రిడ్జిపై భారీ రోడ్డు ప్రమాదం

Pune-Bengaluru highway accident: బెంగళూరు-పూణె హైవేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని నవాలే వంతెన వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‍లో ఏకంగా 48 వాహనాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. పూణె అగ్నిమాపక దళం ఈ విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు సాగుతుండగా.. మరింత అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

పూణె అగ్నిమాపక దళం, పూణె మెట్రోపాలిటన్ రిజనల్ డెవలప్‍మెంట్ అథారిటీ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నాయి. ఓ ట్రక్ కంటైనర్ బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం మొదలైందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ట్రక్ మరిన్ని వాహనాలను ఢీకొందని తెలుస్తోంది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో మరిన్ని వాహనాలు జారి అదుపు తప్పి ఒకదానికి ఒకటి ఢీకొన్నాయని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలోనూ కొందరు పోస్ట్ చేశారు.

ఈ భారీ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. సహాయక చర్యల తర్వాత అధికారులు ఈ విషయంపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.