mahindra ev SUV launch: ఎం అండ్ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు..!
15 August 2022, 19:58 IST
Mahindra new electric car launch : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది! కొత్తగా ఐదు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది.
ఎం అండ్ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు..!
Mahindra new electric car launch : ఎస్యూవీ సెగ్మెంట్లో దూసుకెళుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం).. ఆ విభాగంలో మరో అడుగు ముందుకేసింది. ఒకేసారి.. ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది.
ఎస్యూవీ సెగ్మెంట్లో బలంగానే ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనాల పోటీలో మహీంద్రా అండ్ మహీంద్రా కాస్త వెనకపడింది. మార్కెట్లో.. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు(ఈ వెరిటో) ఒక్కటే ఉంది. ఇక తాజాగా ఈ ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో ఇందులోనూ తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోమవారం విడుదల చేసింది.
mahindra ev SUV launch: ఏ బ్రాండ్ల కింద?
కొత్త ఎస్‌యూవీలను ఎక్స్‌యూవీ- బీఈ అనే రెండు బ్రాండ్ల కింద అమ్మేందుకు ప్రణాళికలు రచిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్‌ది పైచేయి. కాగా.. టాటా మోటార్స్‌ని ఢీకొట్టే విధంగా ప్రణాళికలు వేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇందులో భాగంగా.. కొత్త ఎస్‌యూవీలు.. 2024 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది.
వాస్తవానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే.. ఇండియాలో ఈవీ సెగ్మెంట్ అంత మెరుగ్గా లేదు. కానీ ఒక్కసారి క్లిక్ అయితే.. విప్లవాత్మక మార్పులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల.. అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌వైపు అడుగులు వేస్తున్నాయి.
ఓలా కూడా..
ప్రముఖ టూవీలర్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా సైతం.. ఎలక్ట్రిక్ కారు రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించి.. ఎలక్ట్రిక్ కారును సోమవారం ఆవిష్కరించింది. 2024 మధ్యలో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఓలా.
ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.