తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahindra Xuv700 : మహీంద్రా ఎక్స్​యూవీ700 జోరు.. 1.5లక్షల బుకింగ్స్​

Mahindra XUV700 : మహీంద్రా ఎక్స్​యూవీ700 జోరు.. 1.5లక్షల బుకింగ్స్​

Sharath Chitturi HT Telugu

24 July 2022, 16:54 IST

google News
    • Mahindra XUV700 : లాంచ్​ అయిన 11 నెలల్లోనే 1.5లక్షల బుకింగ్స్​తో దూసుకెళుతోంది మహీంద్రా ఎక్స్​యూవీ700. ఆ వివరాలు..
మహీంద్రా ఎక్స్​యూవీ700 జోరు.. 1.5లక్షల బుకింగ్స్​
మహీంద్రా ఎక్స్​యూవీ700 జోరు.. 1.5లక్షల బుకింగ్స్​ (HT AUTO)

మహీంద్రా ఎక్స్​యూవీ700 జోరు.. 1.5లక్షల బుకింగ్స్​

Mahindra XUV700 : మహీంద్రా ఎక్స్​యూవీ700.. రోడ్డు మీదే కాదు.. రికార్డుల విషయంలోనూ దుసుకెళుతోంది! లాంచ్​ అయిన 11నెలల్లోనే 1.5లక్షల బుకింగ్స్​ను సంపాదించుకుంది మహీంద్రా ఎక్స్​యూవీ700. ఇంత తక్కువ సమయంలో అన్ని బుకింగ్స్​ సంపాదించుకున్న వాహనంగా మహీంద్రా ఎక్స్​యూవీ700 నిలిచింది.

గతేడాది ఆగస్టులో మహీంద్రా ఎక్స్​యూవీ700 లాంచ్​ అయ్యింది. బేసిక్​ మోడల్​ ప్రైజ్​(ఎక్స్​షోరూం) రూ. 11.99లక్షలతో ఈ మోడల్​ మార్కెట్​లోకి వచ్చింది. కానీ వాహనాల ధరలు పెరగడంతో ఇప్పుడు ఆ బేసిక్​ మోడల్​ ధర రూ. 13.18లక్షలుగా(ఎక్స్​షోరూం) ఉంది.

డెలివరీ ఢమాల్​..

వాస్తవానికి మహీంద్రా ఎక్స్​యూవీ700 లాంచ్​కి ముందే బుకింగ్స్​ వెల్లువెత్తాయి. కానీ బుకింగ్స్​ని.. డెలివరీలు అందుకోలేకపోతున్నాయి! చిప్​ల కొరత కారణంగా.. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700ని దక్కించుకోవాలంటే.. నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికీ ఇదే పరిస్థితి. ఇండియాలోని ఎస్​యూవీల్లో.. మహీంద్రా ఎక్స్​యూవీ700కే అత్యధిక వెయింటింగ్​ పీరియడ్​ ఉండటం గమనార్హం.

Mahindra XUV700 waiting period : వేరియంట్ల బట్టి.. కొన్నికొన్ని డెలివరీలకు ఏకంగా రెండేళ్ల వెయిటింగ్​ పీరియడ్​ ఉందని తెలుస్తోంది. జూన్​ నాటికి దేశవ్యాప్తంగా 42,000 మహీంద్రా ఎక్స్​యూవీ700 వాహనాలు డెలివరీ అయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే.. ఇంకా 1లక్షల మంది ఈ వాహనం గురించి ఎదురుచూస్తున్నట్టే.

వాహనాల తయారీలో సవాళ్లు ఉన్నాయని అంగీకరిస్తూనే.. వాటిని అధిగమించేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు మహీంద్రా అండ్​ మహీంద్రా వెల్లడించింది. ఇంత వెయిటింగ్​ పీరియడ్​ ఉండటం తమకు సిగ్గుచేటుగా అనిపిస్తోందని ఇటీవలే.. హిందుస్థాన్​టైమ్స్​ ఆటోకు పేర్కొంది.

మరోవైపు.. సరికొత్త స్కార్పియోను మహీంద్రా అండ్​ మహీంద్రా ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం