Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్​ కారు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500కి.మీల రేంజ్​!-all you need to know about ola electric car and its first look ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్​ కారు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500కి.మీల రేంజ్​!

Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్​ కారు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500కి.మీల రేంజ్​!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 03:40 PM IST

Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్​ కారు ఫస్ట్​ లుక్​ వచ్చేసింది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఓలా ఎలక్ట్రిక్​ కారు 500కి.మీలు ప్రయాణిస్తుంది!

<p>ఓలా ఎలక్ట్రిక్​ కారు వచ్చేస్తోంది</p>
ఓలా ఎలక్ట్రిక్​ కారు వచ్చేస్తోంది (Mint)

Ola Electric Car : దేశంలో తమ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్​ కారును సోమవారం ఆవిష్కరించింది ఓలా. ఓలా ఎలక్ట్రిక్​ కారు అదిరిపోయే లుక్స్​తో వస్తుందని సంస్థ వెల్లడించింది. పైగా.. కారు రూఫ్​ అంతా గ్లాస్​తో ఉంటుందని వెల్లడించింది.

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే కొత్త ఓలా ఎలక్ట్రిక్​ కారు 500కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు! 0-100 వేగాన్ని 4సెకన్లలోనే అందుకోగలగడం ఈ ఓలా ఎలక్ట్రిక్​ కారు ప్రత్యేకత.

ఓలా ఈవెంట్​లో భాగంగా.. సీఈఓ భవిష్​ అగర్వాల్​ ప్రసంగించారు. కొత్త ఓలా ఎలక్ట్రిక్​ కారు 2024లో దేశంలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్​ కారు ప్రదర్శన, డిజైన్​.. అన్నింటినీ అత్యంత జాగ్రత్తగా, యూజర్లకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. కొత్త వాహనానికి సంబంధించిన టీజర్​ను సైతం విడుదల చేశారు భవిష్​. ఈ ఓలా ఎలక్ట్రిక్​ వాహనంలో.. సంస్థ సొంతంగా తయారు చేసిన MoveOS ఫీచర్​ ఉంటుందని వివరించారు.

"న్యూ ఇండియాకు తగ్గట్టుగా ఒక కారు ఉండటం ప్రజలకు అవసరం. భవిష్యత్తును సొంతంగా రాసుకుంటూ, ధైర్యంతో ముందుకెళుతోంది ఈ న్యూ ఇండియా. అందుకు తగ్గట్టుగానే.. దేశంలోని అత్యంత వేగవంతమైన కార్లలో మా కారు ఒకటిగా నిలుస్తుంది. 0-100 వేగాన్ని కేవలం 4 సెకన్లలో చేరుకుటుంది. ఛార్జ్​ చేస్తే 500కి.మీ దూరం ప్రయాణిస్తుంది," అని భవిష్​ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఓలా ప్లాంట్​లో విస్తరణ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ తర్వాత.. రెండు వెహికిల్​ ప్లాట్​ఫామ్​లు, ఆరు కొత్త కార్లను అభివృద్ధిచేసేందుకు ఓలా ప్రణాళికలు రచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్​ కారులో.. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీని వినియోగించనున్నారు. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీలను ఎలక్ట్రిక్​ వాహనాల్లో వినియోగించడం.. ఇదే తొలిసారి! అతేకాకుండా.. 50 నగరాల్లో 100కుపైగా హైపర్​ ఛార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు హామీనిచ్చింది.

ఓలా ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన మరిన్ని ఫీచర్లు, ధర వివరాలను సంస్థ ఇప్పుడు వెల్లడించలేదు.

ఓలా ఎస్​1 ప్రో:-

Ola S1 pro : ఓలా ఎలక్ట్రిక్​ కారుతో పాటు ఓలా ఎస్​1 ప్రోకు చెందిన కొత్త కలర్​ను కూడా ప్రకటించింది సంస్థ. ధరను కూడా వివరించింది.

ఓలా ఎస్​1 ప్రో.. ప్రస్తుతానికి మార్ష్​మెల్లో, నియో మింట్​, పోర్సెలిన్​ వైట్​, కోరల్​ గ్లామ్​, జెట్​ బ్లాక్​, లిక్విడ్​ సిల్వర్​, మాట్​ బ్లాక్​, అంత్రాసేట్​ గ్రే, గెరువా రంగుల్లో అందుబాటులో ఉంది. తాజాగా.. 'ఖాకీ' రంగును కూడా తీసుకొచ్చింది ఓలా. దీని ధర రూ. 99,999గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం