Maharashtra rape case : ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్ అత్యాచారం.. లిఫ్ట్‌లో!
10 December 2022, 16:25 IST
Maharashtra rape case : ఓ భవనంలో ఏసీని రిపేర్ చేయడానికి వెళ్లిన మెకానిక్.. అక్కడే ఉన్న 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐదేళ్ల చిన్నారిపై మెకానిక్ అత్యాచారం.. లిఫ్ట్‌లో!
Maharashtra rape case : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 5ఏళ్ల చిన్నారిపై ఓ ఏసీ మెకానిక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లిఫ్ట్‌లో దారుణం…!
నవీ ముంబైలోని భవనంలో మంగళవారం జరిగింది ఈ ఘటన. 19ఏళ్ల నిందితుడు ఓ ఏసీ మెకానిక్. భవనంలోని ఓ ఇంట్లో ఏసీని రిపేర్ చేసి.. మెట్ల మార్గంలో కిందికి దిగాడు. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని చూశాడు. ఆమెను బలవంతంగా లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి లైంగికంగా దాడి చేసి, రేప్ చేశాడు.
Maharashtra crime news : ఈ ఘటన జరిగిన వెంటనే ధితురాలు ఇంటికి పరిగెత్తి వాంతులు చేసుకుంది. అది ఆమె తల్లి గమనించింది. ఏం జరిగిందని ప్రశ్నిచగా.. బాలిక మొత్తం చెప్పింది. కిందికి పరుగులు తీసిన తల్లికి నిందితుడు కనిపించాడు. ఆమె అరుపులతో.. చుట్టుపక్కన వారంతా అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిపై సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
బాలుడిపై అత్యాచారం..!
ఓ బాలుడిపై ఓ 34ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.
Uttar Pradesh rape case : 9ఏళ్ల బాలుడు ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాడు. ఇటీవలే వారి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చింది. గురువారం ఓ వివాహ వేడుకకు హాజరైంది. అక్కడ ఓ వ్యక్తి.. బాలుడిని బలవంతంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లాడు. అతడిని రేప్ చేసేందుకు యత్నించాడు. బాలుడు గట్టిగా అరిచాడు. బాత్రూమ్ నుంచి శబ్దాలు రావడంతో అందరు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే బాలుడి తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Man rapes boy : నిందితుడు.. మీరట్ గంగా నగర్ కాలనీకి చెందిన నిశాంత్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని జైలుకు తరలించారు.