తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Crime News : పాల ప్యాకెట్​ కోసం దుకాణానికి వెళ్లిన బాలికపై అత్యాచారం!

UP crime news : పాల ప్యాకెట్​ కోసం దుకాణానికి వెళ్లిన బాలికపై అత్యాచారం!

04 December 2022, 14:06 IST

  • UP crime news : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16ఏళ్ల బాలికపై ఓ దుకాణదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఉత్తర్​ప్రదేశ్​లో బాలికపై అత్యాచారం..
ఉత్తర్​ప్రదేశ్​లో బాలికపై అత్యాచారం..

ఉత్తర్​ప్రదేశ్​లో బాలికపై అత్యాచారం..

UP rape case : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్​ కొనుక్కోవడం కోసం దుకాణానికి వెళ్లిన ఓ బాలిక అత్యాచారానికి గురైంది!

ట్రెండింగ్ వార్తలు

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

ఇదీ జరిగింది..

షామ్లి జిల్లాలో నివాసముండే ఓ 16ఏళ్ల బాలిక.. పాల ప్యాకెట్​ కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దుకాణంలోకి వెళ్లగా.. అక్కడే ఉన్న దుకాణదారుడు.. అమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాలిక ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు.. ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్లారు. షాపులో స్పృహ తప్పి పడిపోయిన బాలికను చూశారు.

UP crime news : కొద్దిసేపటి తర్వాత.. బాలిక నుంచి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులను ఆశ్రయించి.. దుకాణదారుడిపై ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

కారు డ్రైవర్​…

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాల ప్యాకెట్​ కొనేందుకు వెళ్లిన 11ఏళ్ల బాలికను.. మీరట్​లో ఓ కారు డ్రైవర్​ కిడ్నాప్​ చేశాడు. ఆమెను రేప్​ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు.

Man rapes girl : బాధిత బాలిక.. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. కొన్ని గంటల తర్వాత.. ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలిక గురించి సమాచారం అందుకున్న ఆమె తల్లి.. ఘటనాస్థలానికి పరుగులు తీసింది. ఏం జరిగిందో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డను అపహరించి, రేప్​ చేశారని ఆరోపించింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాను పరిశీలించారు. ఓ కారు ఆగడం, బాలిక అది ఎక్కడం అందులో రికార్డు అయ్యింది.

మరోవైపు.. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రిపోర్టులు వచ్చిన తర్వాత.. బాలికిపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది తేలుతుందని పోలీసులు చెప్పారు.

కారును, డ్రైవర్​ను ట్రేస్​ చేసి, వీలైనంత త్వరగా శిక్ష విధిస్తామని బాలిక తల్లికి పోలీసులు హామీనిచ్చారు.

తదుపరి వ్యాసం