తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rape On Student: లా స్టూడెంట్ పై రేప్.. పైగా ఆ పని కోసం ఒత్తిడి! Mla పీఏతో పాటు…

Rape On Student: లా స్టూడెంట్ పై రేప్.. పైగా ఆ పని కోసం ఒత్తిడి! MLA పీఏతో పాటు…

HT Telugu Desk HT Telugu

02 December 2022, 15:04 IST

    • Warangal Crime News: ఓ న్యాయ విద్యార్థిని పట్ల హాస్టల్ నిర్వాహకురాలు దారుణానికి ఒడిగట్టింది. డబ్బుల కోసం కక్కుర్తికి పాల్పడింది. ఏకంగా కొందరి దగ్గరికి పంపించి డబ్బులు సంపాదించే పనిలో పడింది. ఈ వ్యవహారం కాస్త బయటికి రావటంతో... ఆమెతో పాటు ఓ ఎమ్మెల్యే పీఏ కూడా ఇందులో అరెస్ట్ అయ్యారు.
ఎమ్మెల్యే పీఏ అరెస్ట్,
ఎమ్మెల్యే పీఏ అరెస్ట్,

ఎమ్మెల్యే పీఏ అరెస్ట్,

Rape On Law Student in Warangal: లా విద్యార్థిని...ప్రస్తుతం నాల్గో సంవత్సరం చదువుతోంది. ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే హాస్టల్ నిర్వాహకురాలు చేసిన పనితో ఆ అమ్మాయి జీవితం ఆగాథంలోకి నెట్టినట్లు అయింది. డబ్బుల కోసం కక్కుర్తి పడి... అ అమ్మాయిని తెలిసిన వారి వద్దకు పంపించింది. వారి కోరికలు తీర్చటమే కాకుండా... వ్యభిచారం రొంపిలోకి దిగాలని బలవంతం చేసే ప్రయత్నం చేసింది. ఈ బాధ భరించలేని సదరు విద్యార్థిని... పోలీసులను ఆశ్రయించింది. ఇక ఈ కేసులో సంచనల విషయాలు బయటికి వచ్చాయి. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పోలీసులు వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఎల్ఎల్ బీ నాల్గొ సంవత్సరం చదువుతోంది. కాలేజీకి దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. ఈ హాస్టల్ ను వేముల శోభ అనే మహిళ నిర్వహిస్తుంది. ఆమె ఆ విద్యార్థిని కుటుంబనేపథ్యం, ఆర్థిక స్థితి గమనించి.. బలవంతంగా తనకు పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గరికి గత కొద్దిరోజులుగా పంపుతోంది.

హాస్టల్ నిర్వాహకురాలి వేధింపులు ఎక్కువగా కావటంతో భరించలేని విద్యార్థిని... రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో ఓ అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ పీఏ వేముల శివ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వేముల శివ కుమార్ ఈ హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభకు మరిది అవుతాడు. అతనితో పాటు హనుమకొండ చౌరస్తా దగ్గర్లో మెడికల్ షాపు నడుపుతున్న కోటవిజయ్ కుమార్ అనే వ్యక్తి.. తన మీద అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

వీరే కాకుండా... తనని పలువురి వ్యక్తులకు వద్దకు పంపిందని విద్యార్థిని ఫిర్యాదులో ప్రస్తావించింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు... హాస్టల్ నిర్వాహకురాలు శోభతో పాటు వేముల శివ కుమార్, కోట విజయ్ కుమార్ లను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు హన్మకొండ పోలీసులు వివరాలను వెల్లడించారు.

కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహరంలో ఉన్న అందర్నీ అరెస్ట్ చేస్తామని చెప్పారు.