Teacher rapes minor girl: బాలికపై అత్యాచారం; ఆఫ్తాబ్ లా చంపేస్తానని బెదిరింపు-computer teacher arrested for raping minor girl over two years in up s ghaziabad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Computer Teacher Arrested For Raping Minor Girl Over Two Years In Up's Ghaziabad

Teacher rapes minor girl: బాలికపై అత్యాచారం; ఆఫ్తాబ్ లా చంపేస్తానని బెదిరింపు

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 11:49 PM IST

Teacher rapes minor girl: పాఠశాలలో కంప్యూటర్ నేర్పించే టీచర్.. భయపెట్టి, 9వ తరగతి విద్యార్థినిని రెండేళ్లుగా రేప్ చేస్తున్న దారుణ ఘటన యూపీలో జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Teacher rapes minor girl: ఘజియాబాద్ లోని ఒక పాఠశాలలో కంప్యూటర్ టీచర్ గా పని చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిన సౌరభ్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Teacher rapes minor girl: రెండేళ్లుగా అఘాయిత్యం

సౌరభ్ గుప్తా ఘజియాబాద్ లోని ఒక పాఠశాలలో కంప్యూటర్ టీచర్ గా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదివే విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మొదట, కంప్యూటర్ నేర్పిస్తానని, మంచి మార్కులు వచ్చేలా చూస్తానని చెప్పి ఆ బాలికను లోబర్చుకున్నాడు. ఆ తరువాత, గ్రేడ్స్ తక్కువ వచ్చేలా చూస్తానని, ఫెయిల్ చేస్తానని బెదిరించి, లైంగిక దాడి చేయడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఆ బాలికను బెదిరిస్తూ, అత్యాచారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులకు గానీ, మరెవరికైనా కానీ చెపితే, ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు.

Teacher rapes minor girl: శ్రద్ధ వాకర్ ను ముక్కలు చేసినట్లు..

ఇటీవల శ్రద్ధ వాకర్ దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత.. ఆ బాలికను బెదిరించడానికి ఈ అంశాన్ని కూడా వాడుకోవడం ప్రారంభించాడు. ఎవరికైనా చెబితే.. ఆఫ్తాబ్ శ్రద్ద వాకర్ ను ముక్కలు ముక్కలుగా నరికినట్లు నరికేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. చివరకు ఆ బాలిక ధైర్యం కూడగట్టుకుని ఈ దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

Teacher rapes minor girl: పోలీసు కేసు

దాంతో, ఆ బాలిక తల్లిదండ్రులు నంద్ గ్రామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కీచక టీచర్ ను అరెస్ట్ చేశారు. వేరే కొందరు బాలికలపై ఇలా బెదిరించి అత్యాచారం చేసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. అతడిపై ఐపీసీ, పొక్సొ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పర్చారు.

IPL_Entry_Point