Kia soul accident : ఇలాంటి కార్ యాక్సిడెంట్ మీరు ఎప్పుడు చూసుండరు!
28 March 2023, 13:29 IST
Kia soul accident viral video : అమెరికాలో కియా సోల్ కారుకు జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియోలో.. ట్రక్ టైర్ తగిలి.. కియా సోల్ కారు గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టింది!
ఇలాంటి కార్ యాక్సిడెంట్ మీరు ఎప్పుడు చూసుండరు!
Kia Soul viral video US : రోడ్డు ప్రమాదాలు సాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జురుగుతుంటాయి. కారు వెళ్లి లారీని ఢీకొట్టిందనో, బైక్ వెళ్లి కారును ఢీకొట్టిందనో.. నిత్యం వార్తల్లో వింటూనే ఉంటాము. అయితే.. అమెరికా కాలిఫోర్నియాలో ఇటీవలే జరిగిన ఓ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి కార్ యాక్సిడెంట్‌ను మీరు ఎప్పుడు చూసి ఉండరు! చూసిన వారందరు షాక్‌కు గురవుతున్నారు.
అసలేం జరిగింది..
Kia Soul accident : కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌కు సమీపంలో జరిగింది ఈ ఘటన. సంబంధిత వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఓ హైవే కనిపిస్తోంది. ముందు ఓ ట్రక్ వెళుతోంది. ఇంతలో వెనుక నుంచి ఓ 'కియా సోల్' కారు దూసుకెళ్లింది. ట్రక్- కియా సోల్ పక్కపక్కకు వచ్చాయి. ఇక్కడి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ క్షణంలో పరిస్థితి తలకిందులైపోయింది!
కియా సోల్ కారు క్రాస్ చేస్తున్న సమయంలోనే ట్రక్ ఎడమ టైర్ ఊడిపోయింది! అది సరిగ్గా వెళ్లి.. కియా సోల్ ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఆ వెంటనే.. కియా సోల్ కారు గాల్లోకి ఎగిరి.. అనేకమార్లు పల్టీ కొట్టింది. కింద పడిన వెంటనే కూడా అనేకమార్లు పల్టీకొట్టంది.
Kia Soul accident viral video : మరోవైపు ఎడమ టైర్ ఊడిపోవడంతో ఆ ట్రక్ బ్యాలెన్స్ కోల్పోయింది. కుడివైపునుకు వెళ్లిపోయి.. చివరికి ఆగిపోయింది.
ఈ ఘటనలో కియా సోల్ ఔటర్ పార్ట్ ధ్వంసమైంది. కానీ క్యాబిన్ మాత్రం అలాగే ఉంది! ఫలితంగా.. కియా సోల్‌లోని డ్రైవర్‌కు ఎలాంటి గాయాలవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత.. అతను కారులో నుంచి లేచి వెళ్లిపోయాడు! ఈ ఒళ్లుగగుర్పొడిచే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదు.
Kia Soul viral video : కియా సోల్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియోను చూసిన వారందరు షాక్‌కు గురవుతున్నారు. ‘ఇంతసేపు ఇదొక సినిమా సీన్ అనుకున్నా.. ఇది నిజంగానే జరిగిందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. “ఇంత జరిగినా ఎవరికి ఏం అవ్వకపోవడం సంతోషకరం,” అని మరో యూజర్ రాసుకొచ్చాడు. ‘ఇలాంటి ప్రమాదాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు,’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.