Viral Video: నడిరోడ్డుపై అమ్మాయిని తీవ్రంగా కొట్టి.. బలవంతంగా కారులోకి..: చోద్యం చూసిన జనాలు
19 March 2023, 13:28 IST
- Delhi Viral Video: ఓ అమ్మాయిని ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టి.. కారులో ఎక్కించాడు. నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
Viral Video: నడిరోడ్డుపై అమ్మాయిని తీవ్రంగా కొట్టి.. బలవంతంగా కారులోకి.. (Photo: Twitter)
Man beats woman on busy road - Viral Video: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ అమ్మాయని ఓ వ్యక్తి నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టి బలవంతంగా క్యాబ్‍లో ఎక్కించాడు. అతడితో ఉన్న మరో వ్యక్తి కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. అలాగే రోడ్డుపై ఉన్న ఇతరులు కూడా కనీసం స్పందించలేదు. అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బిజీగా ఉండే రోడ్డుపై ఇది జరిగింది. ఆ అమ్మాయిని ఆ యువకుడు పలుమార్లు తీవ్రంగా కొట్టి.. కారులో బలవంతంగా ఎక్కించాడు. ఆ తర్వాత ఇద్దరు యువకులు కూడా ఆ కారులోనే వెళ్లారు. క్యాబ్ డ్రైవర్ కూడా ఈ దాడిని ఆపేందుకు అసలు ప్రయత్నించలేదు.
పోలీసుల విచారణ
Man beats woman on busy road - Viral Video: వాయువ్య ఢిల్లీలోని మంగోల్‍పురి (Mangolpuri) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమ్మాయిని ఓ యువకుడు నడిరోడ్డుపై కొట్టి ట్యాక్సీలో ఎక్కించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. క్యాబ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని యజమాని ఇంటికి పోలీస్ బృందం వెళ్లింది.
శనివారం రాత్రి ఐఎఫ్ఎఫ్‍సీఓ చౌక్ వద్ద చివరగా ఆ క్యాబ్ కనిపించిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు ఎక్కడెక్కడ తిరిగిందో పరిశీలిస్తున్నామని అన్నారు.
పోలీసుల అదుపులో డ్రైవర్
Man beats woman on busy road - Viral Video: ఇప్పటికైతే క్యాబ్ డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముగ్గురు ప్యాసింజర్లు ఎక్కడ ట్యాక్సీ ఎక్కారు.. ఎక్కడి వరకు ప్రయాణించారు అనే సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. రోహిణి నుంచి వికాస్‍పురి వరకు ఉబెర్ యాప్‍లో ఈ క్యాబ్‍ను వారు బుక్ చేసుకున్నట్టు తేలింది. ఆ ప్రయాణం మధ్యలోనే రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది. ఓ యువకుడు.. అమ్మాయిని తీవ్రంగా కొట్టి క్యాబ్‍లోకి బలవంతంగా నెట్టాడు. వారితో మరో యువకుడు కూడా ఉన్నాడు.
ట్విట్టర్‌లో ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీ మహిళలపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయిందని, మహిళల భద్రతను ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ యూజర్ రాసుకొచ్చారు. రోడ్డు మధ్యలో ఇది జరిగినా ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో దాడి చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు కోరారు.