తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Upsrtc Bus Viral Video: ఆర్టీసీ పరువు తీసిన డ్రైవర్.. అధికారుల చర్యలు

UPSRTC bus viral video: ఆర్టీసీ పరువు తీసిన డ్రైవర్.. అధికారుల చర్యలు

25 March 2023, 17:24 IST

ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌కు సంబంధించిన ఒక బస్సు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో డ్రైవర్ బస్సును టాప్ గేర్‌లో నడపటానికి ఎవరూ ఊహించని టెక్నిక్‌ని ఉపయోగించడం చూపరులకు నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు బస్సును తనిఖీ చేయగా, అది బాగానే ఉందని డిపార్ట్‌మెంట్ పరువు తీసేందుకు డ్రైవర్‌ ప్రయత్నిస్తున్నాడని తేలింది. దాంతో అతనిపై చర్యలకు ఉపక్రమించింది.