AP Road Accidents : 10 నెలల్లో 6.56 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. కారణాలివేనా?-road accidents rise in andhra pradesh in past 10 months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Road Accidents Rise In Andhra Pradesh In Past 10 Months

AP Road Accidents : 10 నెలల్లో 6.56 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. కారణాలివేనా?

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 02:42 PM IST

Andhra Pradesh Road Accidents : ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది 6.56 శాతం పెరిగాయి. మెుదటి 10 నెలల్లో 5,800 మంది చనిపోయారు.

రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు

గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రోడ్డు ప్రమాదాల మరణాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జనవరి నుంచి అక్టోబర్ 2022 మధ్య, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) మరణాలు 6.56 శాతం పెరిగాయి. 5,831కి చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో 5,472గా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మరణాల సంఖ్యను 15 శాతం తగ్గించే లక్ష్యంతో ఏపీ రోడ్డు భద్రతా మండలి ప‌రిమితులను విధించింది. అయినా.. వాస్తవ సంఖ్య 25.37 శాతం పెరిగింది. ప్రమాదాల సంఖ్య 9.95 శాతం పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 11.11 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మెుదటి పది నెలల్లో 26 జిల్లాల్లో 14,314 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 5,831 మంది చనిపోయారు. 15,585 మంది గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్.. రోడ్డు సేఫ్టీ కౌన్సిల్(Andhra Pradesh Road Safety Council) మరణాల సంఖ్యను 15 శాతం తగ్గించే లక్ష్యంతో 'తట్టుకోగల పరిమితి'ని నిర్ణయించింది. అతి వేగం ప్రధాన కారణంగా ఉందని రోడ్డు భద్రతా మండలి సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి కూడా.. దయనీయంగా ఉందన్నారు. లైట్ మోటారు వాహనాలు కాకుండా, లారీలు మరియు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు(Buses) ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు చాలా సాధారణం అయ్యాయన్నారు.

2021లో ఏపీలో మొత్తం 19,729 రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరిగాయి. 8,053 మంది మృతి చెందారు. 21,169 మంది గాయపడ్డారు. 2020 సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 10.16 శాతం పెరిగింది. మరణాలు 14.08 శాతం పెరిగాయి. 2020లో కొవిడ్ సంవత్సరం అయినప్పటికీ.. రాష్ట్రంలో 17,910 ప్రమాదాలు జరిగాయి. 7,059 మరణాలు, 19,612 మందికి గాయాలు అయ్యాయి. మూడేళ్ల క్రితం రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు(Supreme Court) కమిటీ రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు పలు చర్యలను సూచించింది.

సుప్రీం కోర్టు కమిటీ సూచన మేరకు.., రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతపై నామమాత్రపు లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అయితే అవసరమైన సిబ్బందిని నియమించలేదు. సుప్రీం కోర్టు కమిటీ నిర్ణయాలను అమలు చేయడంలో, విధాన రూపకల్పనలో, లీడ్ ఏజెన్సీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌కు సహాయం చేయాల్సి ఉంటుంది. ‘జిల్లా స్థాయిలో కూడా లీడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి కార్యచరణ జరగలేదు. రహదారి భద్రతకు సంబంధించిన ఎలాంటి ప్రణాళికలను గ్రౌండ్ లెవల్‌లో అమలులోకి తీసుకురావడానికి యంత్రాంగం లేదు.’ అని ఓ సీనియర్ అధికారి తెలుపారు.

మరోవైపు, రాష్ట్రంలో 1,200 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించామని వాటిలో సగం కూడా సరిగ్గా లేవని అధికారులు చెబుతున్నారు. 'రాష్ట్రంలో ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయో రోడ్లను పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రమాదాలను అరికట్టడానికి, ప్రాణాలను రక్షించడానికి, రహదారి భద్రతను సమర్థవంతంగా చేయడానికి ప్రతి అంశాన్ని పరిష్కరించాలి.' అని ఆయన అన్నారు.

IPL_Entry_Point