తెలుగు న్యూస్  /  National International  /  Itbp Constable Recruitment 2022 Know Vacancies Eligibility Conditions Application Process Here

ITBP Recruitment 2022: ఐటీబీపీలో బార్బర్, వాషర్ మ్యాన్, టైలర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా

HT Telugu Desk HT Telugu

14 November 2022, 9:15 IST

    • ITBP Recruitment 2022: ఐటీబీపీలో 287 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.
ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల
ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల (ANI)

ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల

ITBP Recruitment 2022: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ ర్యాంకుతో వివిధ జాబ్స్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు డిసెంబర్ 22తో పూర్తవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

ITBP Recruitment 2022 vacancy details: ఐటీబీపీ రిక్రూట్మెంట్ వేకెన్సీ వివరాలు

ఐటీబీపీ తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 287 వేకేన్సీల్లో విభిన్న రకాల పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ టైలర్ పోస్టులు 18, కానిస్టేబుల్ గార్డెనర్ 16 పోస్టులు, బూట్ల మరమ్మతులకు సంబంధించిన కానిస్టేబుల్ కాబ్లర్ పోస్టులు 31, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి పోస్టులు 78 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ పోస్టులు 89, కానిస్టేబుల్ బార్బర్ పోస్టులు 55 ఉన్నాయి.

ITBP Recruitment 2022 age limit: వయో పరిమితి ఇలా..

కానిస్టేబుల్ టైలర్, గార్డెనర్, కాబ్లర్ పోస్టులకు వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, వాషర్‌మ్యాన్, బార్బర్ పోస్టులకు వయస్సు కనిష్టంగా 18, గరిష్టంగా 25 ఏళ్లు ఉండాలి.

ITBP Recruitment 2022 application fee: ఐటీబీపీ రిక్రూట్మెంట్ దరఖాస్తు రుసుము

ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు రుసుము అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులైతే రూ. 100 చెల్లించాలి. అలాగే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా అయితే దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు, ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ కింది వెబ్‌సైట్‌లో నేరుగా చూడొచ్చు.

ఐటీబీపీ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్ లింక్ ఇదే.