ITBPF Constable Recruitment 2022: ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై ఇలా-itbpf head constable and constable motor mechanic recruitment 2022 find full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Itbpf Head Constable And Constable Motor Mechanic Recruitment 2022 Find Full Details Here

ITBPF Constable Recruitment 2022: ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై ఇలా

HT Telugu Desk HT Telugu
Oct 28, 2022 12:38 PM IST

ITBPF Head Constable and Constable (Motor mechanic) Recruitment 2022: ఐటీబీపీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఐటీబీపీ బలగాలు
ఐటీబీపీ బలగాలు

ITBPF Head Constable and Constable (Motor mechanic) Recruitment 2022: కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండో - టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ విభాగం హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల కోసం అర్హులైన పురుష దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవి గ్రూప్ - సీ నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులు. ప్రస్తుతానికి టెంపరరీ బేసిస్ పోస్టులైనప్పటికీ భవిష్యత్తులో పర్మనెంట్ చేసే అవకాశం ఉందని ఐటీబీపీఎఫ్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

ITBPF Constable Recruitment 2022: పోస్టుల సంఖ్య, రిజర్వేషన్లు ఇలా..

ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు మొత్తం 58 ఉన్నాయి. ఇందులో 26 అన్ రిజర్వ్‌డ్ పోస్టులు కాగా 6 ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నాయి. ఓబీసీ కోటాలో 14, ఎస్సీ కోటాలో 8, ఎస్టీ కోటాలో 4 ఉన్నాయి.

ఇక కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్ ) పోస్టులు 128 భర్తీ చేయనుంది. ఇందులో 54 అన్ రిజర్వ్‌డ్ పోస్టులు, 13 ఈడబ్ల్యూఎస్, 33 ఓబీసీ, 18 ఎస్సీ, 10 ఎస్టీ రిజర్వ్‌డ్ పోస్టులు ఉన్నాయి.

ITBPF Constable Recruitment 2022: పేస్కేల్, ఇతర భత్యాలు ఇలా..

హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) వేతనం - లెవల్ 4 పే మాట్రిక్స్ రూ. 25,500 నుంచి రూ. 81,110 (ఏడో వేతన సంఘం అనుసరించి) ఉంటుంది.

కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) వేతనం - లెవల్ 3 పే మాట్రిక్స్ రూ. 21,700 నుంచి రూ. 69,100 (ఏడో వేతన సంఘం అనుసరించి) ఉంటుంది.

ITBPF Constable Recruitment 2022: ఇతర భత్యాలు:

ఐటీబీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులకు కరువు భత్యం, రేషన్ మనీ, స్పెషల్ కంపెన్సేటరీ అలొవెన్స్, ఉచిత వసతి లేదా హెచ్‌ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలొవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఉచిత వైద్య సదుపాయాలు, సందర్భానుసారం ఇతర భత్యాలు వర్తిస్తాయి.

ITBPF Constable Recruitment 2022: అర్హతలు ఇవీ

హెడ్ కానిస్టేబుల్: వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఐటీఐ నుంచి మోటార్ మెకానిక్ సర్టిఫికెట్ పొంది, ఆ ట్రేడ్‌లో మూడేళ్ల ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.

కానిస్టేబుల్: వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

రిజర్వేషన్ అనుసరించి వయస్సు నిబంధనల్లో సడలింపులు ఉంటాయి.

ఎత్తు 170 సెంటిమీటర్లు ఉండాలి. చాతీ చుట్టుకొలత విస్తరించినప్పుడు 85 సెం.మీ., సాధారణ స్థితిలో 80 సెంటిమీటర్లు ఉండాలి.

ITBPF Constable Recruitment 2022: దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ఐటీబీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. 29 అక్టోబరు 2022 నుంచి 27 నవంబరు 2022 అర్ధరాత్రి 11.59 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తులను ఐటీబీపీఎఫ్ వెబ్‌సైట్‌ https://recruitment.itbpolice.nic.in/  లో సమర్పించాలి. అనంతరం అడ్మిట్ కార్డులు జారీ అయితాయి. వాటిలో పరీక్ష తేదీ, పరీక్ష సెంటర్ తదితర వివరాలు ఉంటాయి.

ఐటీబీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్టీ) నిర్వహిస్తారు. పీఈటీలో 1.6 కి.మీ. పరుగు పందెం 7 నిమిషాల 30 సెకెండ్లలో పూర్తిచేయాలి. లాంగ్ జంప్ మూడు ఛాన్సుల్లో 11 ఫీట్లు దూకాలి. హై జంప్ మూడు ఛాన్సుల్లో మూడున్నర ఫీట్ల ఎత్తు దూకాలి.

రాతపరీక్షలో జనరల్ నాలెడ్జి, మాథ్స్, హిందీ, ఇంగ్లీష్, ట్రేడ్ సంబంధిత థియరీ ప్రశ్నలు ఉంటాయి.

ఎంపికలో భాగంగా ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్ కూడా ఉంటుంది. వెహికిల్ ఇన్‌స్పెక్షన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, హాండ్లింగ్ టూల్స్ వంటి అంశాల్లో 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

IPL_Entry_Point