SSC Constable GD recruitment 2022: భారీగా కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై ఇలా..
SSC Constable GD recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 24,369 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు, తదితర వివరాలు ఇక్కడ చూడండి.

SSC Constable GD recruitment 2022: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ), సెక్రెటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిఫాయి పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నవంబరు 30 వరకు అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2023 జనవరిలో నిర్వహిస్తుంది.
SSC Constable GD recruitment vacancy details: కానిస్టేబుల్ జీడీ రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు
మొత్తంగా 24,369 ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తోంది. ఎస్ఎస్ఎఫ్, రైఫిల్‌మ్యాన్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిధిలోని సిపాయి పోస్టులు కూడా భర్తీ చేయనుంది.
SSC Constable GD recruitment age limit: కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2023 నాటికి 18 ఏళ్ల వయస్సు నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
SSC Constable GD recruitment educational qualification: కానిస్టేబుల్ పోస్టులకు విద్యార్హతలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు విద్యార్హతలు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణఉలై ఉండాలి.
SSC Constable SSC GD Constable recruitment: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించాలి.
2. హోం పేజీలో రిజిస్టర్‌పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
3. apply online అనే టాబ్ క్లిక్ చేసి SSC GD లింక్ సెలెక్ట్ చేసుకోవాలి.
4. ఫారం నింపి దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
5. ఫారమ్ Submit చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసి పెట్టుకోవాలి.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ (జీడీ) రిక్రూట్మెంట్ సమగ్ర ప్రకటన కోసం కింది పీడీఎఫ్ పరిశీలించండి.