తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Negative Covid Mandatory: ఈ దేశాల వారికి ‘కోవిడ్ నెగటివ్’ తప్పని సరి

Negative Covid mandatory: ఈ దేశాల వారికి ‘కోవిడ్ నెగటివ్’ తప్పని సరి

HT Telugu Desk HT Telugu

28 December 2022, 19:39 IST

  • Negative Covid mandatory: కోవిడ్ ముప్పు తరుముకు వస్తున్న పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలకు భారత ప్రభుత్వం పదును పెడ్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

ప్రతీకాత్మక చిత్రం

Negative Covid mandatory: చైనా, ఫ్రాన్స్, అమెరికా, దక్షిణ కొరియా, మలేసియా, జపాన్ తదితర దేశాల్లో కొరోనా ప్రస్తుతం విజృంభణ దశలో ఉంది. చైనాలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. మిగతా దేశాల్లోనూ కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది.

Negative Covid mandatory: ఇండియా ఆంక్షలు

ఈ నేపథ్యంలో కొరోనా ను కట్టడి చేసే దిశగా భారత ప్రభుత్వం ఆంక్షలను క్రమంగా పెంచుతోంది. కొరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించేలా చూడాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. కచ్చితంగా మాస్క్ లు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత కోసం తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, సానిటైజర్ ను వినియోగించాలని ప్రజలకు సూచించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణీకులపై ర్యాండమ్ టెస్ట్ లు నిర్వహించాలని ఆదేశించింది.

Negative Covid mandatory: వారికి నెగటివ్ తప్పదు

తాజాగా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్(negative RT-PCR test) ను వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ దేశాల్లో కొరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గత రెండు రోజుల్లో భారత్ వచ్చిన 6 వేల మందికి కోవిడ్ టెస్ట్ చేయగా, 39 మందికి పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలపారు.

టాపిక్