BF.7 variant India : యూపీలో కొవిడ్​ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​!-up man who returned from china tests positive quarantined at home ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bf.7 Variant India : యూపీలో కొవిడ్​ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​!

BF.7 variant India : యూపీలో కొవిడ్​ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 26, 2022 07:05 AM IST

BF.7 variant India : యూపీలో కొవిడ్​ కలకలం రేగింది. చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్​ అని తేలింది.

యూపీలో కొవిడ్​ కలకలం
యూపీలో కొవిడ్​ కలకలం (PTI)

BF.7 variant India : చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్​ సోకిందన్న వార్త ఉత్తర్​ ప్రదేశ్​లో కలకలం సృష్టించింది. చైనాలో ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ బీఎఫ్​.7 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వార్తతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

40ఏళ్ల వ్యక్తి.. రెండు రోజుల క్రితమే చైనా నుంచి తిరిగొచ్చాడు. కొవిడ్​ పరీక్షల్లో అతనికి పాజిటివ్​ అని తేలింది. ఆ వెంటనే అతడిని హోం ఐసొలేషన్​లో పెట్టినట్టు చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ అరుణ్​ శ్రీవాస్తవ తెలిపారు. జీనోమ్​ సీక్వెన్సింగ్​ కోసం.. సంబంధిత వ్యక్తి సాంపిల్​ను లక్నోకు పంపించనున్నట్టు వివరించారు.

Uttar Pradesh covid news : "ఈ వ్యక్తిని హోం ఐసొలేషన్​లో పెట్టారు. అతని కుటుంబసభ్యులు, అతడిని కలిసిన వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ బృందాలకు ఆదేశాలు అందాయి," అని అరుణ్​ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

చైనా నుంచి ఆగ్రాకు ఈ నెల 23న వచ్చాడు ఆ వ్యక్తి. ప్రైవేటు ల్యాబ్​లో పరీక్షలు నిర్వహించుకోగా.. కొవిడ్​ పాజిటివ్​ అని తేలింది.

BF.7 variant cases in India : చైనాలో కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే కేంద్రం సైతం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, సిద్ధంగా ఉండాలని ఆరోగ్య వ్యవస్థకు సూచించింది. ఈ క్రమంలోనే మాక్​ డ్రిల్స్​ను సైతం వివిధ ఆసుపత్రులు చేపడుతున్నాయి.

కొవిడ్​ను ఎదుర్కొనేందుకు ఉత్తర్​ ప్రదేశ్​ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆగ్రా యంత్రాంగం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. తాజ్​ మహల్​, ఆగ్రా ఫోర్ట్​, అక్బర్​ టూంబ్​లను సందర్శిస్తున్న విదేశీయుల సాంపిల్స్​ను సేకరిస్తోంది. ఆగ్రా ఎయిర్​పోర్ట్​, రైల్వే స్టేషన్​లలో కూడా ఈ ప్రక్రియ చేపట్టింది. ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచనలు చేస్తోంది.

భయపడాల్సిన అవసరం లేదు..!

Covid cases in India : చైనాతో పోల్చుకుంటే.. కొవిడ్​ కొత్త వేరియంట్​ బీఎఫ్​.7 ప్రభావం ఇండియాలో తక్కువగానే ఉంటుందని సీసీఎంబీ(సెల్యూలర్​ అండ్​ మాలిక్యులర్​ బయోలాజీ) డైరక్టర్​ వినయ్​ కే నందికూరి తెలిపారు. భారతీయుల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే ఈ ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు.

బీఎఫ్​.7 ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించాలి అని పిలుపునిచ్చారు వినయ్​ కే నందికూరి. ఒమిక్రాన్​ వేరియంట్లకు రోగనిరోధక శక్తిని బలహీనపరిచే శక్తి ఉంటుందని హెచ్చరించారు.

India BF.7 variant news : "డెల్టాతో పోల్చుకుంటే బీఎఫ్​.7 వేరియంట్​ తీవ్రత తక్కువగానే ఉంది. హెర్డ్​ ఇమ్యూనిటీ పొందడమే ఇందుకు కారణం. మనపై ఇతర వైరస్​ల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టే మనకి హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల బీఎఫ్​.7తో భయపడాల్సిన పని లేదు. డెల్టాతో భయపడ్డాము. ఆ తర్వాత టీకాలు వచ్చాయి. ఆ తర్వాత ఒమిక్రాన్​ వచ్చింది. దానిపై పోరాటంగా బూస్టర్​ డోస్​లు వచ్చాయి. చైనాతో పోల్చుకుంటే మనం చాలా డిఫరెంట్​. చైనాలో ఇప్పుడు జరుగుతున్నది ఇండియాలో జరగకపోవచ్చు," అని సీసీఎంబీ డైరక్టర్​ వినయ్​ కే నందికూరి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం