తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Make In India Threat: మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పాలసీతో త్రివిధ దళాలకు కొత్త ముప్పు

Make in India threat: మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పాలసీతో త్రివిధ దళాలకు కొత్త ముప్పు

08 September 2022, 15:05 IST

  • Make in India threat: స్వావలంబన లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా పాలసీతో భారత్ లోని త్రివిధ దళాలకు కొత్త ముప్పు వచ్చిపడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Make in India threat: ఒకవైపు అవసరమైనంత స్థాయిలో ఆయుధాలు దేశీయంగా తయారు కాక, మరోవైపు మేక్ ఇన్ ఇండియా పాలసీ వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేక.. త్రివిధ దళాలు ఇరుకున పడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Make in India threat: మేక్ ఇన్ ఇండియా

భారతదేశం అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో స్వావలంబన సాధించే లక్ష్యంతో, అలాగే, విదేశీ మారకాన్ని పొదుపు చేసే ఉద్దేశంతో 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని రూపకల్పన చేసింది. ఇందుకు గానూ దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది.

Make in India threat: ఆయుధాల కొరత

ఈ పాలసీ కారణంగా కీలకమైన రక్షణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. భారత్ లోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్ లు ఎప్పటికప్పుడు తమ ఆయుధ వ్యవస్థలను అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలం చెల్లిన ఆయుధ వ్యవస్థలు, చాపర్లు, ఫైటర్ జెట్స్ స్థానంలో కొత్త, ఆధునిక వ్యవస్థలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడే, ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం కారణంగా సమస్య ఎదురవుతోంది. ఈ విధానంలోని ఆంక్షల కారణంగా త్రివిధ దళాలు కొన్ని కీలకమైన ఆయుధ వ్యవస్థలను దిగుమతి చేసుకోలేక పోతున్నాయి. మరోవైపు, దేశీయంగా వాటి ఉత్పత్తి కూడా అవసరమైన స్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో చైనా, పాకిస్తాన్ వంటి శత్రు పొరుగు దేశాల నుంచి అకస్మాత్తుగా ముప్పు ఎదురైతే ఎదుర్కోవడం కష్టమవుతుందని సైనిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Make in India threat: చాపర్లు; ఫైటర్ జెట్స్..

2026 నాటికి ఆర్మీ హెలీకాప్టర్ల కొరత తీవ్రంగా ఉండబోతోందని, అలాగే, 2030 నాటికి వందల సంఖ్యలో ఫైటర్ జెట్ల కొరత ఉండబోతోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. హిమాలయాల సరిహద్దుల్లో నిఘా కోసం కనీసం 42 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్స్ అవసరం ఉండగా, 2030 నాటికి వాటి సంఖ్య 30 కన్నా దిగువకు తగ్గే ప్రమాదముందని హెచ్చరించాయి. ఒక్కో ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి. మిలటరీ కొనుగోళ్ల విషయంలో, కనీసం 30% నుంచి 60% వరకు దేశీయ కాంపొనెంట్స్ ఉండాలని ‘మేక్ ఇన్ ఇండియా’ పాలసీ నిర్దేశిస్తుంది. దేశీయ ఆయుధ వ్యవస్థల కంపెనీలు ఆ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా, వైమానిక దళం శక్తిమంతంగా లేనట్లయితే, దేశీయ యుద్ధ పటిమ దాదాపు 50% తగ్గిపోతుందని యుద్ధ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.