తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Has To Study Math Till 18: అక్కడ 18 ఏళ్లు వచ్చేవరకు మ్యాథ్స్ చదవాల్సిందే

One has to study math till 18: అక్కడ 18 ఏళ్లు వచ్చేవరకు మ్యాథ్స్ చదవాల్సిందే

HT Telugu Desk HT Telugu

04 January 2023, 22:04 IST

  • One has to study math till 18: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆ దేశ విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (AP)

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్

One has to study math till 18: భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూకేే లోని ప్రతీ విద్యార్థి ఇకపై 18 ఏళ్లు వచ్చేవరకు గణితం చదవాల్సిందేనని నిబంధన తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

One has to study math till 18: మ్యాథ్స్ చాలా ముఖ్యం..

ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయిందని, డేటా, స్టాటిస్టిక్స్ కీలకంగా మారాయని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రతీ ఉద్యోగానికి విశ్లేషణాత్మక సామర్ధ్యాలు చాలా అవసరమవుతాయని, గణితం అందుకు మూలంగా ఉంటుందని లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ రిషి సునక్ వివరించారు. ఇప్పటి నుంచి యూకేలో చదివే ప్రతీ విద్యార్థి, తనకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏదో ఒక విధంగా గణితాన్ని సిలబస్ లో భాగంగా చదవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రధాని కార్యాలయం జనవరి 4న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

One has to study math till 18: చాలా తక్కువ మంది…

ప్రస్తుతం యూకేలో 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లల్లో సగానికి పైగా మ్యాథ్స్ ను ఒక సబ్జెక్టుగా చదవడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఉద్యోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని రిషి సునక్ ఈ నిర్ణయం తీసుకున్నారని బ్రిటన్ లోని ప్రధాని కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూకేలోని పిల్లలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలన్నది ప్రధాని రిషి సునక్ లక్ష్యమని వివరించారు. సునక్ రాజకీయాల్లోకి రావడానికి అదే ప్రధాన కారణమన్నారు. సరైన ప్రణాళిక, అత్యున్నత ప్రమాణాలు అందించాలన్న పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయి విద్యా విధానాలను తలదన్నగలమని తన ప్రసంగంలో రిషి సునక్ వ్యాఖ్యానించారు.

టాపిక్