తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Groups Of Students Clash On Jnu: జేఎన్ యూలో రెండు స్టుడెంట్ గ్రూపుల మధ్య ఘర్షణ

Groups of students clash on JNU: జేఎన్ యూలో రెండు స్టుడెంట్ గ్రూపుల మధ్య ఘర్షణ

HT Telugu Desk HT Telugu

11 November 2022, 22:11 IST

  • Groups of students clash on JNU: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తగాదా ముదిరి కొట్టుకునే వరకు వెళ్లింది. 

జేఎన్ యూ క్యాంపస్
జేఎన్ యూ క్యాంపస్

జేఎన్ యూ క్యాంపస్

Groups of students clash on JNU: JNU లో శుక్రవారం రెండు విద్యార్థి బృందాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నర్మద హాస్టల్ వద్ద ఈ ఘర్షణ జరిగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా చీలి, కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Groups of students clash on JNU: ఇద్దరికి గాయాలు..

JNU లోని నర్మద హాస్టల్ వద్ద జరిగిన ఘర్షణల్లో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో స్వల్ప చికిత్స అనంతరం వారిని పంపించేశారు. ఒక చిన్న వ్యక్తిగత తగాదా రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు కర్రలు, రాళ్లు, రాడ్లతో కొట్టుకోవడంతో శుక్రవారం సాయంత్రం నర్మద హాస్టల్ వద్ద కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Groups of students clash on JNU: ఫిర్యాదు రాలేదు..

నర్మద హాస్టల్ వద్ద విద్యార్థులు కొట్టుకుంటున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. అప్పటికే అక్కడ పరిస్థితి సద్దుమణిగిందని, తమకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఘర్షణకు దిగిన రెండు గ్రూపులకు కూడా ఎలాంటి రాజకీయ సంబంధాలు కానీ లేవని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ ఘర్షణల వెనుక ఎలాంటి విద్యార్థి సంఘాల పాత్ర లేదని తెలిపారు. ఈ ఘర్షణలకు కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు.

Groups of students clash on JNU: వీడియో వైరల్

JNU లోని నర్మద హాస్టల్ వద్ద రెండు విద్యార్థి బృందాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు అక్కడి విద్యార్థుల్లో వైరల్ గా మారాయి. దాదాపు 10 మంది విద్యార్థులు కర్రలు, రాళ్లతో క్యాంపస్ లో తిరుగుతున్నదృశ్యాలు, ఒక కారులోనుంచి కర్రలతో కొందరు దిగుతున్న దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయి.