తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mukesh Ambani's Security: ముకేశ్ అంబానీ సెక్యూరిటీ పెంపు

Mukesh Ambani's security: ముకేశ్ అంబానీ సెక్యూరిటీ పెంపు

HT Telugu Desk HT Telugu

29 September 2022, 21:45 IST

  • Mukesh Ambani's security: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సెక్యూరిటీని పెంచారు. 

ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటో)
ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటో)

ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటో)

Mukesh Ambani's security: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి 'Z plus ' కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముకేశ్ అంబానీ ప్రాణాలకు ముప్పు ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

Mukesh Ambani's security: 2013 లోనే..

2013లోనే ముకేశ్ అంబానీకి Z కేటగిరీ భద్రత కల్పించారు. పేమెంట్ బేసిస్ పై ఆయనకు అప్పుడు సీఆర్ఫీఎఫ్ దళాలతో Z కేటగిరీ భద్రత కల్పించారు. ముకేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ 'Y కేటగిరీ భద్రతలో ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 11 వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ భద్రతను Z కేటగిరీ కి పెంచుతూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయనకు దాదాపు 40 నుంచి 50 సీఆర్పీఎఫ్ కమాండోలు విడతల వారీగా భద్రత కల్పిస్తారు. అంబానీకి వ్యక్తిగతంగానూ, అలాగే, ఆయన కార్యాలయాలు, నివాసానికి కూడా ఈ భద్రత వర్తిస్తుంది.

Mukesh Ambani's security: పేలుడు పదార్ధాలతో ఎస్ యూ వీ

గత సంవత్సరం ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్ధాలతో ఉన్న ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ భద్రతను పెంచారు. ఈ కేసును ఎన్ఐఏ విాచారిస్తోంది. మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీకి కూడా గత నెలలో ప్రభుత్వం Z కేటగిరీ భద్రత కల్పించింది.

టాపిక్