GATE 2023 admit cards : నేడు 'గేట్' అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
03 January 2023, 8:33 IST
- GATE 2023 admit cards : 2023 గేట్ అడ్మిట్ కార్డ్స్ నేడు విడుదల కానున్నాయి. ఆ వివరాలు..
నేడు గేట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
GATE 2023 admit cards : 2023 గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను నేడు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది.. గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది. 2023 గేట్ అడ్మిట్ కార్ట్.. gate.iitk.ac.in లో రిలీజ్ అవుతుంది.
ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో 2023 గేట్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 21న 2023 గేట్ కీని విడుదల చేస్తారు. అభ్యంతరాలను తెలియజేసేందుకు ఫిబ్రవరి 22-25 వరకు అవకాశాన్ని కల్పించింది ఐఐటీ కాన్పూర్.
ఇక 2023 గేట్ పరీక్షల ఫలితాలను మార్చ్ 16న విడుదల చేస్తారు.
గేట్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా..
Gate 2023 dates : స్టెప్ 1:- గేట్ అధారిక వెబ్సైట్ అయిన gate.iitk.ac.inకు వెళ్లాలి
స్టెప్ 2:- 2023 గేట్ అడ్మిట్ కార్డ్‌కు సంబంధించిన లిక్ హోం పేజ్‌లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- మీ లాగిన్ డీటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
స్టెప్ 4:- మీ అడ్మిట్ కార్డు.. స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవాలి.
Gate 2023 schedule : ఇంజినీరింగ్, టెక్నాలజీ ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో ప్రవేశాల కోసం ఈ జాతీయ స్థాయి గేట్ పరీక్షను నిర్వహిస్తారు. మాస్టర్స్, పోస్ట్గ్రాడ్జ్యుయేషన్ కోర్సుల కోసం ఈ గేట్ స్కోర్‌ను చూస్తారు. అంతేకాకుండా.. పలు పీఎస్‌యూ ఉద్యోగాల్లోనూ ఈ గేట్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. అందుకే ప్రతియేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షను రాస్తారు.