GATE 2023: గేట్ అప్లికేషన్ల‌పై కీలక ప్రకటన-gate 2023 application correction window to open on november 8 find full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gate 2023 Application Correction Window To Open On November 8 Find Full Details Here

GATE 2023: గేట్ అప్లికేషన్ల‌పై కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 10:18 AM IST

GATE 2023 application: గేట్ అప్లికేషన్ ప్రక్రియపై కీలక ప్రకటన వెలువడింది.

GATE 2023 Application correction window: నవంబరు 8న తెరుచుకోనున్న గేట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో
GATE 2023 Application correction window: నవంబరు 8న తెరుచుకోనున్న గేట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో

కాన్పూర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నవంబర్ 8, 2022న గేట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ చేస్తుంది. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏవైనా సవరణలు చేయాలనుకుంటే GATE అధికారిక సైట్ ద్వారా వాటిని సమర్పించవచ్చు.

దరఖాస్తులో మార్పులు చేయడానికి నవంబర్ 14, 2022 వరకు గడువు ఇచ్చారు. గేట్ 2023 పరీక్ష ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలు ఫిబ్రవరి 15న అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ కీ ఫిబ్రవరి 21, 2023న అందుబాటులో ఉంటుంది.

ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 25, 2023 వరకు అభ్యర్థులు ఆన్సర్ కీపై తమ ఛాలెంజెస్ సమర్పించవచ్చు. ఫలితాలు మార్చి 16న ప్రకటిస్తారు. స్కోర్ కార్డ్ మార్చి 21, 2022న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయడానికి అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

Gate 2023: అప్లికేషన్‌లో మార్పులు ఎలా చేయాలి

GATE అధికారిక సైట్‌ని సందర్శించండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గేట్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.

లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.

మీ దరఖాస్తు ఫారమ్ సమర్పించడం పూర్తయింది. ఇక పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీ భద్రపరుచుకోండి.

IPL_Entry_Point

టాపిక్