తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gail Gas Recruitment: గెయిల్ గ్యాస్ లో అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

GAIL Gas recruitment: గెయిల్ గ్యాస్ లో అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

09 March 2023, 15:10 IST

  • GAIL Gas recruitment: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ గ్యాస్ లిమిటెడ్ (GAIL Gas Limited) సీనియర్ అసోసియేట్ (Senior Associate), జూనియర్ అసోసియేట్ (Senior Associate) (Junior Associate) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Archive)

ప్రతీకాత్మక చిత్రం

GAIL Gas recruitment: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 సీనియర్, జూనియర్ అసోసియేట్ పోస్ట్ లను గెయిల్ గ్యాస్ భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

GAIL Gas recruitment: ఆన్ లైన్ లో అప్లై..

గెయిల్ గ్యాస్ రిక్రూట్ మెంట్లో జూనియర్, సీనియర్ అసోసియేట్ పోస్ట్ లకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గెయిల్ గ్యాస్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ gailgas.com ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. మార్చి 10 వ తేదీ నుంచి gailgas.com వెబ్ సైట్లో అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా విండో ఓపెన్ అవుతుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10.

GAIL Gas recruitment Vacancy Details: ఇవే వేకెన్సీ వివరాలు..

  • సీనియర్ అసోసియేట్ - టెక్నికల్ (Sr. Associate Technical): 72 పోస్ట్ లు.
  • సీనియర్ అసోసియేట్ - ఫైర్ అండ్ సేఫ్టీ (Sr. Associate Fire & Safety): 12 పోస్ట్ లు
  • సీనియర్ అసోసియేట్ -మార్కెటింగ్ (Sr. Associate Marketing): 6 పోస్ట్ లు
  • సీనియర్ అసోసియేట్ -ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (Sr. Associate Finance & Accounts): 6 పోస్ట్ లు
  • సీనియర్ అసోసియేట్ - కంపెనీ సెక్రటరీ (Sr. Associate Company Secretary): 2 పోస్ట్ లు
  • సీనియర్ అసోసియేట్ - హ్యూమన్ రిసోర్సెస్ (Sr. Associate Human Resource): 6 పోస్ట్ లు
  • జూనియర్ అసోసియేట్ (Jr. Associate): 16 పోస్ట్ లు
  • ఈ పోస్ట్ ల విద్యార్హత, వయో పరిమితి, రిజర్వేషన్లు తదితర వివరాల కోసం gailgas.com వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను చదవండి.
  • ఈ పోస్ట్ ల్లో సీనియర్ అసోసియేట్ జాబ్ కోసం ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూనియర్ అసోసియేట్ జాబ్ కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

GAIL Gas recruitment: అప్లికేషన్ ఫీజు..

గెయిల్ గ్యాస్ లిమిటెడ్ లో సీనియర్, జూనియర్ అసోసియేట్ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు పరీక్ష ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ. 100 ను అప్లికేషన్ ఫీగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారికి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.