తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Vaccine Side-effects: ‘కొరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవమే’

COVID vaccine side-effects: ‘కొరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వాస్తవమే’

HT Telugu Desk HT Telugu

17 January 2023, 22:07 IST

  • Covid vaccine side effects: కోవిడ్ 19 టీకా దుష్ప్రభావాలపై ప్రజల్లో వ్యాప్తి లో ఉన్న అనుమానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. టీకా తీసుకున్న తరువాత కొందరికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని స్పష్టం చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ టీకా (Covid vaccine) పై చాలా రోజులుగా పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ టీకా (Covid vaccine) తీసుకోవడం వల్ల్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని పలువురు వైద్య నిపుణులు సహా చాలామంది హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలకు ప్రభుత్వం ఇన్నాళ్లు కొట్టివేస్తూ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Covid vaccine side effects: ICMR, CDSCO ఒప్పుకోలు

తాజాగా కోవిడ్ టీకా (Covid vaccine) తో అనారోగ్యాలు సంభవించే అవకాశముందని ఐసీఎంఆర్, సీడీఎస్సీఓ( Indian Council of Medical Research- ICMR, Central Drugs Standard Control Organization- CDSCO) ఒప్పుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఐసీఎంఆర్, సీడీఎస్సీఓ( ICMR, CDSCO) ఆ మేరకు జవాబిచ్చినట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. కోవిడ్ టీకా (Covid vaccine) తీసుకున్న వారిలో చాలామందికి తీవ్ర స్థాయి అనారోగ్యాలు సంభవిస్తాయన్న వాదన సరికాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే, టీకా (Covid vaccine) తీసుకున్న కొందరిలో మాత్రం తీవ్ర స్థాయి అనారోగ్యాలకు అవకాశం ఉందని అంగీకరించింది. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వివరించింది. మీడియాలో వచ్చినట్లు టీకా (Covid vaccine) తీసుకున్నవారికి పెద్ద సంఖ్యలో తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయనడం సరికాదని పేర్కొంది. ఆ మీడియా కథనాలు తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందిన వార్తలని స్పష్టం చేసింది. సమాచార హక్కు దరఖాస్తుకు ICMR ఇచ్చిన సమాధానంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల వెబ్ సైట్ల లింక్స్ మాత్రమే ఇచ్చిందని వివరించింది. కోవిడ్ టీకా (Covid vaccine) ల ప్రభావాలపై వాటిలో ఉన్న సమాచారాన్ని మాత్రమే పొందుపర్చిందని వెల్లడించింది. టీకా (Covid vaccine) తీసుకోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టాన్ని నివారించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది.

టాపిక్