తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Famous Youtuber Dies: 300 కిమీల వేగంతో బైక్ పై స్టంట్స్; యూట్యూబర్ దుర్మరణం

Famous Youtuber dies: 300 కిమీల వేగంతో బైక్ పై స్టంట్స్; యూట్యూబర్ దుర్మరణం

HT Telugu Desk HT Telugu

05 May 2023, 14:43 IST

  • Famous Youtuber dies while racing bike at 300 kpmh: పాపులర్ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో యమున ఎక్స్ ప్రెస్ వే పై బైక్ పై గంటకు 300 కిమీల వేగం (300 kpmh) తో దూసుకువెళ్తూ ప్రమాదానికి గురై, ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యూట్యూబర్ అగస్త్య చౌహాన్
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యూట్యూబర్ అగస్త్య చౌహాన్

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యూట్యూబర్ అగస్త్య చౌహాన్

Famous Youtuber dies while racing bike at 300 kpmh: బైక్ రేసర్, బైక్ పై స్టంట్స్ చేస్తూ వీడియోలు తీసి, వాటిని యూట్యూబ్ (Youtube) లో అప్ లోడ్ చేసే ఫేమస్ యూట్యూబర్ (Youtuber) అగస్త్య చౌహాన్ (Agastya Chauhan) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదానికి గురై సమయంలో అతడు బైక్ పై గంటకు 300 కిమీల వేగం (300 kpmh) తో దూసుకువెళ్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Famous Youtuber dies:12 లక్షల సబ్ స్క్రైబర్లు

భారత్ లోని ప్రముఖ యూట్యూబర్ల ((Youtuber)) లో అగస్త్య చౌహాన్ (Agastya Chauhan) ఒకడు. అతడి బైక్ రేసింగ్ (bike racing) వీడియోలు యూట్యూబ్ (Youtube) లో చాలా ఫేమస్. అతడికి యూట్యూబ్ లో 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు (subscribers) ఉన్నారు. సోషల్ మీడియాలో అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆగ్రా నుంచి ఢిల్లీకి యమున ఎక్స్ ప్రెస్ వే (Yamuna expressway) పై వెళ్తూ అగస్త్య చౌహాన్ (Agastya Chauhan) ప్రమాదానికి (road accident) గురయ్యాడు. అతడు డ్రైవ్ చేస్తున్న కావసాకి బైక్ (Kawasaki bike) వేగంగా డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అతడు గంటకు సుమారు 300 కిమీల వేగం (300 kpmh) తో ఉన్నాడు. ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే.. అతడు పెట్టుకున్న హెల్మెట్ ముక్కలు ముక్కలైంది. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై అగస్త్య చౌహాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత వేగంగా వెళ్తూ, బైక్ పై అదుపును కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులకు వేగంపై అదుపు చాలా ముఖ్యమని సూచించారు. అగస్త్య చౌహాన్ మృతదేహాన్ని గ్రేటర్ నోయిడాలోని కైలాశ్ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Police warns Bike racers: పోలీసులు సూచనలు..

వాహనదారులు అదుపు తప్పే స్థాయిలో వేగంగా వెళ్లకూడదని అలీఘఢ్ ఎస్పీ కళానిధి నైథాని సూచించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఈ జనవరి నెలలో డెహ్రాడూన్ (Deharadun) రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న అగస్త్య చౌహాన్ పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ప్రాణాలకే కాకుండా, ఇతర వాహన దారుల ప్రాణాలకు, పాదచారుల ప్రాణాలకు ఇలాంటి వారు ప్రమాదకరంగా మారారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.