తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Politics | `నీ కొడుకైతే ఎంపీ కావచ్చు..!`

Maharashtra politics | `నీ కొడుకైతే ఎంపీ కావచ్చు..!`

HT Telugu Desk HT Telugu

24 June 2022, 20:42 IST

  • పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించి వ‌ర్చువ‌ల్ గా చేసిన ప్ర‌సంగంలో మ‌హారాష్ట్ర సీఎం, శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేపై విరుచుకుప‌డ్డారు. షిండే కోరుకున్న‌వ‌న్నీ ఇచ్చాన‌న్నారు.

కొల్హాపూర్‌లో షిండేకు వ్య‌తిరేకంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌
కొల్హాపూర్‌లో షిండేకు వ్య‌తిరేకంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌ (PTI)

కొల్హాపూర్‌లో షిండేకు వ్య‌తిరేకంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌ల నిర‌స‌న‌

త‌న కుమారుడు ఆదిత్య ఠాక్రేపై విమ‌ర్శ‌లు చేయ‌డంపై స్పందిస్తూ.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు ఎంపీ అయ్యాడు.. ఆదిత్య ఠాక్రే మాత్రం రాజ‌కీయంగా ఎద‌గ‌వ‌ద్దా? అని ప్ర‌శ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

శివ‌సేన పార్టీ వేర్లు స్ట్రాంగ్‌

`శివ‌సేన‌ను విడిచివెళ్ల‌డం క‌న్నా చ‌నిపోవ‌డం బెట‌ర్‌` అన్న‌వాళ్లంతా ఇప్ప‌డు పార్టీని విడిచిపోయార‌ని ఉద్ధ‌వ్ వ్యాఖ్యానించారు. ఎంత‌మంది వెళ్లినా పార్టీకి ఏమీ కాద‌ని, పార్టీ వేర్లు చాలా బ‌లంగా ఉన్నాయ‌న్నారు. ప్ర‌తీ సీజ‌న్‌లో ఆకులు, పండ్లు, పువ్వులు రాలిపోవ‌డం స‌హ‌జ‌మేన‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీని మ‌ళ్లీ పునాదుల నుంచి నిర్మించ‌గ‌ల‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఏక్‌నాథ్ షిండే న‌మ్మ‌క ద్రోహం చేశాడ‌ని మండిప‌డ్డారు. త‌ను నిర్వ‌హిస్తున్న మంత్రిత్వ శాఖ స‌హా ఆయ‌న అడిగిన‌వ‌న్నీ ఇచ్చాన‌ని గుర్తు చేశారు.

ఒంట‌రిగా హోట‌ల్ బ‌య‌ట‌కు..

అస్సాంలోని గువాహ‌టిలో ఉన్న రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో ఏక్‌నాథ్ షిండే నాయ‌క‌త్వంలో శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన విష‌యం తెలిసిందే. ఆ హోట‌ల్ బ‌య‌ట మీడియా పెద్ద ఎత్తున మోహ‌రించింది. శుక్ర‌వారం ఉద‌యం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఇన్నోవా కార్లో ఒక్క‌రే హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. దాంతో, ఒక్క‌సారిగా, మీడియా యాక్టివ్ అయింది. షిండే ముంబై వెళ్తున్నార‌ని, ఆయ‌న ఒక్క‌రే వెళ్తున్నార‌ని, ఎమ్మెల్యేలు హోట‌ల్‌లోనే ఉన్నార‌ని, ముంబైలో షిండే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తార‌ని ఊహాగానాలు ప్రారంభించాయి. అయితే, గువాహ‌టిలోని ఒక ప్ర‌ముఖ దేవాల‌యానికి షిండే వెళ్లార‌ని త‌రువాత తెలిసింది.

టాపిక్