తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress Presidential Polls: ‘‘సోనియా మద్దతు నాకు ఉందనడం రూమరే..’’

Congress presidential polls: ‘‘సోనియా మద్దతు నాకు ఉందనడం రూమరే..’’

HT Telugu Desk HT Telugu

12 October 2022, 16:39 IST

  • Congress presidential polls: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్న సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే.. ఈ ఎన్నికల్లో పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియాగాంధీ సపోర్ట్ తనకు ఉందన్న వార్తలు అపోహలేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే (Pramod Adhikari)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే

Congress presidential polls: ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే ఈ పోటీలో నిలుచున్నాను’ అని ఖర్గే వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Congress presidential polls: థరూర్ తో పోటీ లేదు..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తనతో పోటీ పడుతున్న సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ గురించి మాట్లాడుతూ.. థరూర్ తనకు పోటీ కాదన్నారు. తాను సంస్థాగత నాయకుడినని, బ్లాక్ లీడర్ స్థాయి నుంచి ఎదిగానని వివరించారు. ఆ సమయంలో థరూర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. థరూర్ మేనిఫెస్టోపై స్పందిస్తూ.. తన మేనిఫెస్టో ఉదయపూర్ డిక్లరేషనేనని ఖర్గే చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం తన ప్రధాన లక్ష్యాలన్నారు. పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఏ విధులకు ఎవరిని ఎన్నుకోవాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

Congress presidential polls: సోనియా మద్దతు లేదు..

గాంధీ కుటుంబం తనకు పరోక్షంగా సపోర్ట్ చేస్తోందన్న వార్తలను ఖర్గే ఖండించారు. అది ఎవరో కావాలని ప్రచారం చేస్తున్న వదంతు అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్ల తటస్థంగా ఉంటామని సోనియా, రాహుల్, ప్రియాంక ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తన పేరును సోనియా ప్రతిపాదించారన్న వార్త కూడా అబద్ధమని ఖర్గే తెలిపారు.