తెలుగు న్యూస్  /  National International  /  'Clothes Soaked In Urine.. I Was Forced To Face Accused': Victim Slams Air India

Air India flight victims trauma: ‘‘నా బట్టలు, బ్యాగ్ మూత్రంలో తడిచిపోయాయి’’

HT Telugu Desk HT Telugu

06 January 2023, 21:22 IST

  • Air India victims trauma: న్యూయార్క్ - ఢిల్లీ ఫ్లైట్ లో సహ ప్రయాణికుడు యూరిన్ పోయడంతో తీవ్ర ఇబ్బందికి లోనైన ప్రయాణికురాలు ఫ్లైట్లో తను ఎదుర్కొన్న దారుణ అనుభవాలను పంచుకున్నారు. 

నిందితుడు శంకర్ మిశ్రా
నిందితుడు శంకర్ మిశ్రా

నిందితుడు శంకర్ మిశ్రా

Air India victims trauma: ఎయిర్ ఇండియా (Air India) ఫ్లైట్ లో తాను చాలా దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఆ మహిళ తెలిపారు. తనపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తే కాకుండా, ఆ ఫ్లైట్ సిబ్బంది(Air India flight crew) కూడా అత్యంత దారుణంగా, అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు.

Air India flight victims trauma: చేంజ్ చేసుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేదు

తనపై యూరినేట్ చేసిన తరువాత కూడా ఆ వ్యక్తి(అతడిని ముంబై వాస్తవ్యుడైన 34 ఏళ్ల శంకర్ మిశ్రా (Shankar Mishra) గా తరువాత గుర్తించారు) అక్కడే నిలుచుని ఉన్నాడని, ఫ్లైట్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని, మరో ప్రయాణికుడు గట్టిగ చెప్పడంతో ఆ వ్యక్తి (Shankar Mishra) అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆమె వివరించారు. ఆ సమయంలో తాను చాలా ఎంబరాసింగ్ గా ఫీల్ అయ్యానని, అప్పుడు ఫ్లైట్ సిబ్బంది (Air India flight crew) నుంచి కనీస స్పందన లేదని అన్నారు. తనపై యూరినేట్ చేసిన తరువాత మార్చుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేదన్నారు.

Air India flight victims trauma: క్షమాపణలు చెప్పాడు

ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని తాను డిమాండ్ చేశానని, అయితే, ఫ్లైట్ సిబ్బంది (Air India flight crew) ఆ వ్యక్తిని (Shankar Mishra) మళ్లీ తన వద్దకు తీసుకువచ్చి, తన ముందు కూర్చోబెట్టారని ఆమె వెల్లడించారు. ఆ వ్యక్తి ముఖం చూడడం కూడా తనకు ఇష్టం లేదని చెప్పినా ఫ్లైట్ సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ‘‘ఆ వ్యక్తి (Shankar Mishra) నా ముందు కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. తప్పు చేశాను క్షమించమని వేడుకున్నాడు. తన భార్య, పిల్లలు, కుటుంబం ముందు ముఖం చూపించుకోలేనని, తనపై ఫిర్యాదు చేయవద్దని వేడుకున్నాడు. అప్పటికీ నేను తనను క్షమించే ఆలోచనలో లేను. కానీ, విమాన సిబ్బంది (Air India flight crew) బలవంతం చేశారు. విమాన సిబ్బంది తీరు చాలా అమానవీయంగా ఉంది’’ అని ఆమె వివరించారు.

Air India flight victims trauma: ఫ్లైట్ లో ఏం జరిగింది?

ఆ మహిళ ఇచ్చిన పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం బిజినెస్ క్లాస్ లో ఆ బాధిత మహిళ, నిందితుడైన శంకర్ మిశ్రా (Shankar Mishra) ప్రయాణిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా ఆ మహిళ కూర్చుని ఉన్న సీటు వద్దకు వచ్చి, ప్యాంట్ జిప్ తీసి, ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తరువాత కూడా అక్కడే నిల్చున్నాడు. ఆ మహిళ పక్కన కూర్చున్న మరో ప్రయాణికుడు గట్టిగా గద్దించడంతో, తూలుకుంటూ తన సీటు వద్దకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘‘నేను వెంటనే అక్కడి ఫ్లైట్ అటెండెంట్ కు ఈ విషయం చెప్పాను. నా బట్టలు, షూస్, బ్యాగ్ అన్నీ మూత్రంలో తడిచిపోయాయి. నా బ్యాగ్ లో పాస్ పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్స్, కొంత కరెన్సీ ఉంది. యూరిన్ తో తడిచిపోయిన నా వస్తువులను టచ్ చేయడానికి కూడా స్టాఫ్ (Air India flight crew) నిరాకరించారు. నా బ్యాగ్ పై, షూస్ పై డిసిన్ఫెక్టంట్ ను స్ప్రే చేశారు. నన్ను బాత్ రూమ్ వద్దకు తీసుకువెళ్లి, ఎయిర్ లైన్స్ వారి పైజామాను, సాక్స్ ను ఇచ్చారు. నా సీట్ మార్చమని వారిని కోరాను. వారు దానికి కూడా అంగీకరించలేదు. ఫస్ట్ క్లాస్ లో ఖాళీలున్నాయి. అయినా అక్కడి సీట్ ను అలాట్ చేసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. దాదాపు 20 నిమిషాలు నిలుచుని ఉన్న తరువాత, ఫ్లైట్ అటెండెంట్ కూర్చునే చిన్న సీట్ ను ఆఫర్ చేశారు. రెండు గంటల తరువాత మళ్లీ అక్కడి నుంచి లేచి నా సీట్ వద్దకు వెళ్లిపోవాలని కోరారు. నేను గట్టిగా తోసిపుచ్చడంతో, అక్కడ స్టీవార్డ్ కూర్చునే ఒక సీట్ ను నాకు ఇచ్చారు ’’ అని ఆమె విమాన సిబ్బంది అమానవీయ తీరును వివరించారు. అలాంటి, చేదు అనుభవంతో బాధలో ఉన్న నా వద్దకు మళ్లీ అతడిని తీసుకువచ్చి, నన్ను మరింత బాధపెట్టారు’ అని ఎయిర్ ఇండియా సిబ్బంది (Air India flight crew) పై ఆమె మండిపడ్డారు. వారికి కనీస మానవత్వం, నైతికత, వృత్తిపరమైన నిబద్ధత లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Air India flight victims trauma: నిందితుడి ఉద్యోగం పోయింది..

కాగా, న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో వృద్ధురాలైన సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన శంకర్ మిశ్రాను ఆయన వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్న కంపెనీ Wells Fargo ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయనను పట్టుకోవడం కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసును జారీ చేశారు.

టాపిక్