తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Warns Schools: పాఠశాలలకు సీబీఎస్ఈ హెచ్చరిక

CBSE warns Schools: పాఠశాలలకు సీబీఎస్ఈ హెచ్చరిక

HT Telugu Desk HT Telugu

18 March 2023, 10:39 IST

  • CBSE warns Schools: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education CBSE) తన పరిధిలోకి వచ్చే పాఠశాలలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE warns Schools: ఈ విద్యా సంవత్సరంలో ముందే తరగతులను ప్రారంభిస్తున్న పాఠశాలలకు సీబీఎస్ఈ (CBSE) హెచ్చరికలు జారీ చేసింది. తాము జారీ చేసిన అకడమిక్ క్యాలండర్ ను కచ్చితంగా పాటించాలని, తరగతులను ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. కొన్ని పాఠశాలలు పరీక్షలు పూర్తి కాగానే, వెంటనే పై తరుగతుల క్లాస్ లను ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అకడమిక్ క్యాలండర్ ను ఫాలో కాకుండా, ముందే స్కూల్స్ ను ప్రారంభించడం వల్ల విద్యార్థులపై అనవసరంగా అదనపు ఒత్తిడి పడుతుందని CBSE తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

CBSE warns Schools: ఇతర యాక్టివిటీస్ కోసం..

ముందే తరగతులను ప్రారంభించడం వల్ల విద్యార్థులు ఇతర లైఫ్ స్కిల్స్ ను నేర్చుకునే అవకాశం లభించదని సీబీఎస్సీ (CBSE) పేర్కొంది. అకడమిక్స్ తో పాటు ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ వంటివి కూడా విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత అవసరమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీబీఎస్ఈ (CBSE) గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు కచ్చితంగా సీబీఎస్ఈ (CBSE) నిబంధనావళిని పాటించాని, ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు గుర్తించాలని స్పష్టం చేసింది.

టాపిక్