తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | వరుడి 'విగ్గు' ఊడింది.. పెళ్లికి వధువు 'నో' చెప్పింది!

Viral | వరుడి 'విగ్గు' ఊడింది.. పెళ్లికి వధువు 'నో' చెప్పింది!

HT Telugu Desk HT Telugu

23 May 2022, 17:53 IST

    • ఆ వరుడికి బట్టతల ఉంది. వధువు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. 'విగ్గు'తో మ్యానేజ్​ చేశాడు. అంతా బాగానే సాగింది. సరిగ్గా పెళ్లి మండపానికి వెళ్లే సమయంలో.. విగ్గు ఎగిరిపడింది. చివరికి ఆ పెళ్లి ఆగిపోయింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే..
వరుడి విగ్గు ఎగిరింది.. పెళ్లి ఆగింది..
వరుడి విగ్గు ఎగిరింది.. పెళ్లి ఆగింది.. (HT Telugu)

వరుడి విగ్గు ఎగిరింది.. పెళ్లి ఆగింది..

Bride refuses to marry bald groom | ఉత్తర్​ప్రదేశ్​లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి మండపం వద్దకు వెళుతుండగా.. వరుడి 'విగ్గు' ఊడిపోయింది. వరుడి బట్టతల చూసి షాక్​కు గురైన వధువు.. వెంటనే పెళ్లికి నో చెప్పేసింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

విగ్గు ఎగిరింది.. పెళ్లి ఆగింది..

ఉన్నావ్​లో జరిగింది ఈ ఘటన. వరుడు పెళ్లి మండపం వద్దకు నడుస్తున్నాడు. ఇంతలో అతనికి కళ్లు తిరిగాయి. నేల మీద పడిపోయాడు. అదే సమయంలో అతని విగ్గు.. తల మీద నుంచి ఊడి కిందపడిపోయింది. ఇది చూసి, వధువుతో పాటు ఆమె కుటుంబసభ్యులు షాక్​ అయ్యారు. తనకు బట్టతల ఉందన్న విషయం.. వరుడు విగ్గుతో దాచిపెట్టడమే ఇందుకు కారణం. ఇక ఆ వధువు కోపంతో పెళ్లికి నో చెప్పేసింది.

ఆమెకు నచ్చజెప్పేందుకు వధువు తరఫు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. కానీ వధువు అస్సలు వినలేదు. చివరికి ఈ వ్యవహారం స్థానికి పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. పెళ్లి చేసుకోనని అక్కడ కూడా తేల్చిచెప్పింది ఆ వధువు.

పోలీస్​ స్టేషన్​ నుంచి ఈ వ్యవహారం పంచాయతీ వరకు వెళ్లింది. పెళ్లి ఆపేస్తామని వధువు తరఫు కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. పెళ్లి కోసం అప్పటివరకు ఖర్చు చేసిన రూ. 5లక్షలను తిరిగివ్వాలని డిమాండ్​ చేశారు. వరడు తరఫు కుటుంబసభ్యులు.. డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత.. వరుడు, అతని కుటుంబసభ్యలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

'ముందే చెప్పాల్సింది కదా..'

వరుడికి బట్టతల ఉన్న విషయాన్ని దాచకుండా.. ముందే చెప్పి ఉండాల్సిందని వధువు తరఫు బంధువులు అంటున్నారు. అలా చెప్పి ఉంటే.. ముందే మెంటల్​గా ఫిక్స్​ అయ్యేవాళ్లమని చెబుతున్నారు. కానీ పెళ్లి మండపం వద్ద ఎగురుతున్న విగ్గును చూసేసరికి షాక్​ అయ్యామని అంటున్నారు. అబద్ధాలు చెప్పి పెళ్లి జరగాలంటే ఎలా? అని నిలదీశారు.

టాపిక్