తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వరుడి కళ్లెదుటే.. వధువుకు సింధూరం పెట్టిన ప్రియుడు- కథలో అన్నీ ట్విస్ట్​లే!

వరుడి కళ్లెదుటే.. వధువుకు సింధూరం పెట్టిన ప్రియుడు- కథలో అన్నీ ట్విస్ట్​లే!

HT Telugu Desk HT Telugu

06 May 2022, 7:49 IST

    • బిహార్​: పట్నాలో ఇటీవలే జరిగిన ఓ పెళ్లి వేడుక బాలీవుడ్​ సినిమాను తలపిస్తోంది. సరిగ్గా.. వధువు మెడలో వరుడు వరమాల వేసే సమయానికి పెళ్లి మండపానికి వెళ్లాడు ఆమె ప్రియుడు. అందరు చూస్తుండగా వరుడి చేతిలో నుంచి వరమాలను లాక్కుని ఆమె మెడలో వేశాడు. కాగా.. ఈ కథలో మరో ట్వీస్ట్​ కూడా ఉంది.
ట్విస్ట్​ల మీద ట్విస్ట్​లు.. పక్కా ప్లాన్​తో..!
ట్విస్ట్​ల మీద ట్విస్ట్​లు.. పక్కా ప్లాన్​తో..! (HT Telugu)

ట్విస్ట్​ల మీద ట్విస్ట్​లు.. పక్కా ప్లాన్​తో..!

బాలీవుడ్​ సినిమాలను తలపించే ఘటన ఒకటి బిహార్​లో వెలుగులోకి వచ్చింది. గర్ల్​ఫ్రెండ్​ పెళ్లికి వెళ్లిన ప్రియుడు.. వరుడు కళ్లెదుటే ఆమెకు వరమాల వేశాడు. ఆమె నుదిటిపై సింధూరం పెట్టాడు. ఈ కథలో ట్విస్ట్​లే ట్విస్ట్​లు..

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

పెళ్లిని అడ్డుకుని..

పట్నాలోని ఓ మహిళ, ఓ వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. ఆ మహిళకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు ఆమె కుటుంబసభ్యులు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి, పెళ్లి మండపం వద్ద జరిగింది ఈ ఘటన.

వధూవరులు వరమాలలు వేసుకోడానికి సిద్ధపడుతున్న కొన్ని క్షణాల ముందు.. పెళ్లి మండపంపైకి దూసుకెళ్లాడు ఆమె ప్రియుడు. వరుడి చేతుల్లో నుంచి వరమాలను లాగేసుకుని, వధువు మెడపై వేశాడు. అంతటితో ఆగకుండా.. వధువు నుదిటిపై సింధూరం కూడా పెట్టాడు.

పక్కనే ఉన్న వరుడు.. ఇదంతా చూసి నోరెళ్లబెట్టాడు. పెళ్లికి హాజరైన అతిథులు షాక్​ అయ్యారు. ఇరువైపుల కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. చివరికి తేరుకుని.. తమ కోపాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫోన్​ చేశారు.

ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లే సరికి.. మరో ట్విస్ట్ బయటకొచ్చింది.

పక్కా ప్లాన్​..!

వధువు తరఫు కుటుంబసభ్యులు.. పోలీసులకు ఆ వ్యక్తిని అప్పగించారు. అతడిని ఏమీ చేయవద్దను ఆ వధువు వేడుకుంది.

 ఇంతలో వరుడు తన కోపాన్ని బయటపెట్టాడు. ఆ మహిళకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని చెప్పకుండా తనను మోసం చేశారని మండిపడ్డారు. ఆ పెళ్లి తాను చేసుకోనని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా.. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు ఓ విషయం తెలిసింది. ఇంట్లో వాళ్లు ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. ప్రేమికులు ఇద్దరు కలిసే ఈ ప్రణాళికను రచించినట్టు స్పష్టమైంది. వరుడు వరమాల వేసే సమయానికి.. మండపం వద్దకు రావాలని, పెళ్లిని చెడగొట్టాలని తన ప్రియుడుకు ఆ వధువు చెప్పినట్టు సమాచారం.

టాపిక్

తదుపరి వ్యాసం