తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వివాహానికి ఆలస్యంగా వెళ్లిన వరుడు.. వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు..!

వివాహానికి ఆలస్యంగా వెళ్లిన వరుడు.. వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు..!

HT Telugu Desk HT Telugu

29 April 2022, 12:54 IST

    • మహారాష్ట్రలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటున్నాను అన్న ఆనందంలో ఓ వరుడు ఫుల్​గా తాగేసి డ్యాన్స్​ చేస్తూ ఉండిపోయాడు. తన పెళ్లికి తానే ఆలస్యంగా వెళ్లాడు. కోపం తెచ్చుకున్న వధువు తండ్రి.. తన బిడ్డను వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు.
పెళ్లికి ఆలస్యంగా వెళ్లిన వరుడుకు షాక్​..!
పెళ్లికి ఆలస్యంగా వెళ్లిన వరుడుకు షాక్​..! (Getty images)

పెళ్లికి ఆలస్యంగా వెళ్లిన వరుడుకు షాక్​..!

Bride marries another man at wedding | మద్యం మత్తులో తూలుతూ ఉండిపోయిన ఓ వరుడు.. తన పెళ్లికి ఆలస్యంగా వెళ్లాడు. కానీ ఆ పెళ్లి జరగలేదు. అలా అని పెళ్లి ఆగిపోలేదు కూడా. వధువు వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది!

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

బంధువుతో వధువు పెళ్లి ఫిక్స్​..

మహారాష్ట్ర బుల్దానా జిల్లా మల్కాపూర్​ పంగ్ర గ్రామంలో ఈ నెల 22న జరిగింది ఈ ఘటన. సాయంత్రం 4 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. సమయం దాటిపోయినా.. వరుడు పెళ్లి మండపం వద్దకు వెళ్లలేదు. ఫుల్​గా తాగేసి, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్​ చేస్తూ ఉండిపోయాడు.

మద్యం మత్తు నుంచి బయటపడి.. వరుడు మండపానికి వెళ్లేసరికి రాత్రి 8 అయ్యింది. కానీ అతడికి ఊహించను షాక్​ తగిలింది.

వరుడు కోసం వేచి చూసి చిరాకు, కోపం తెచ్చుకున్న వధువు తండ్రి.. తన బిడ్డను అతనికి ఇచ్చి పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వరుడుకు తేల్చిచెప్పాడు.

అదే సమయంలో పెళ్లిని ఆపేయడం కూడా వధువు తండ్రికి ఇష్టం లేదు. అందుకే.. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో తన బిడ్డకు తగిన వ్యక్తిని వెతకడం మొదలుపెట్టాడు. కొద్ది సేపటికి తన బంధువుల్లోనే మరో వ్యక్తిని ఆ తండ్రి చూశాడు. ఇక ఆలస్యం చేయకుండా తన బిడ్డకు, ఆ వ్యక్తికి పెళ్లి చేసేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం