తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అక్క కోసం తెచ్చిన వరుడిని పెళ్లి చేసుకున్న చెల్లి.. స్టోరీ మామూలుగా లేదుగా!

అక్క కోసం తెచ్చిన వరుడిని పెళ్లి చేసుకున్న చెల్లి.. స్టోరీ మామూలుగా లేదుగా!

HT Telugu Desk HT Telugu

09 May 2022, 20:19 IST

    • అక్క కోసం తెచ్చిన వరుడిని ఆమె చెల్లి పెళ్లి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్​ ఉజ్జెయిన్​లో చోటుచేసుకుంది. దీని వెనక ఓ పెద్ద కథే ఉంది.
అక్క వరుడితో చెల్లి వివాహం..!
అక్క వరుడితో చెల్లి వివాహం..! (HT telugu)

అక్క వరుడితో చెల్లి వివాహం..!

Bride marries sister's groom | మధ్యప్రదేశ్​లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్క కోసం తెచ్చిన వరుడిని ఆమె చెల్లి పెళ్లి చేసుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో ఓ పెద్ద కథే ఉంది. అదేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

అలా జరిగిపోయింది..

ఉజ్జెయిన్​కు చెందిన రమేష్​లాల్​కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు నికిత, కరిష్మ. వారిద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించాడు. రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్​లను వరులుగా ఎంపిక చేశాడు. వారి వివాహం ఆదివారం జరిగింది. కానీ రమేష్​లాల్​ ఊహించిన విధంగా కాదు..!

Ujjain bride | ముసుగు ధరించి, ఒకే రకం దుస్తులు వేసుకుని భోలా, గణేష్​లు పెళ్లి మండపానికి వెళ్లారు. ఆ సమయంలో కరెంట్​ పోయింది. ఆగకుండా.. పెళ్లి వేడుకలు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే పురోహితుడు.. అక్కాచెళ్లల్లకు పెళ్లిచేసి ఇంటికి పంపించాడు.

తీరా.. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఒకరు చేసుకోవాల్సి వరుడిని మరొకరు చేసుకున్నారు. అంటే.. అక్క కోసం తెచ్చిన వరుడిని చెల్లి పెళ్లి చేసుకున్నట్టు! ఈ వ్యవహారంపై ఆ కుటుంబాల్లో గొడవ జరిగింది.

చివరికి.. అందరు శాంతించారు. ప్రశాంతంగా ఆలోచించి.. ఆ మరుసటి రోజున.. మళ్లీ పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈసారి కరెక్ట్​ వరుడు.. కరెక్ట్​ వధువు మెడలో కరెక్ట్​గా తాలికట్టాడు.

కర్రలతో కొట్టుకున్న బంధువులు..

మధ్యప్రదేశ్​లో పెళ్లి నేపథ్యంలో ఇటీవల అనేక కథలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన మరో వివాహ వేడుకు ఇప్పుడు వార్తల్లో నిలించింది. వధువు, వరుడు తరఫు బంధువులు.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. దీనంతటికీ కారణం ఓ 'షేర్వాణి'!

మధ్యప్రదేశ్​ ధార్​ జిల్లా మంగబేడా గ్రామంలో శనివారం జరిగింది ఈ ఘటన. షేర్వాణి ధరించి.. పెళ్లి మండపం వద్దకు వెళ్లాడు వరుడు. అది తమ సంప్రదాయం కాదని, వెళ్లి ధోతీ-కుర్తా వేసుకోవాలని వధువు తరఫు కుటుంబసభ్యులు వరుడికి చెప్పారు. అందుకు అతను నిరాకరించాడు. ఇలాంటి సంప్రదాయాలను తాను పట్టించుకోనని తేల్చిచెప్పాడు.

వారి మధ్య మాటలు నడుస్తుండగానే.. అనూహ్యంగా ఓ రాయి వచ్చి వరుడి బంధువలకు తగిలింది. వధువు తరఫు బంధువుల్లో ఒకరు.. ఆ రాయిని విసిరినట్టు తెలిసింది. ఇక అంతే! వరుడు తరఫు బంధువులు కూడా రెచ్చిపోయి.. రాళ్లు విసిరారు. చివరికి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అది సరిపోలేదనుకుని.. కర్రలు తీసుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

పరిస్థితి కాస్త శాంతించిన తర్వాత.. వివాహ వేడుకలోని చాలా మంది.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. పోలీసులు ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

'దుస్తుల గురించి గొడవ మొదలైంది. కర్రలతో కొట్టుకుని, రాళ్లు రువ్వుకున్న వారిని మాత్రమే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను,' అని వధువు చెప్పింది.

పెళ్లి జరిగింది..!

'ఇంత జరిగిన తర్వాత ఆ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది..' అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ పెళ్లి జరగడం గమనార్హం. వధువు, వరుడు తరఫు కుటుంబసభ్యులు మండపానికి వెళ్లి వివాహ కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 'పెళ్లి చేసుకునేడట్టే అయితే.. అంత రచ్చ జరగాల్సిన అవసరం ఏముంది?' అని కామెంట్లు పెడుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం