తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Actor Richa Chadha's Galwan Tweet: సైనికులను అవమానిస్తూ రిచా చద్ధా ట్వీట్

Actor Richa Chadha's Galwan tweet: సైనికులను అవమానిస్తూ రిచా చద్ధా ట్వీట్

HT Telugu Desk HT Telugu

24 November 2022, 21:00 IST

  • Actor Richa Chadha's Galwan tweet: భారతీయ సైనికులను అవమానిస్తూ నటి రిచా చద్ధా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. రాజకీయ పార్టీలు, ప్రముఖులు ఆమె ట్వీట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు. 

బాలీవుడ్ నటి రిచా చద్ధా
బాలీవుడ్ నటి రిచా చద్ధా

బాలీవుడ్ నటి రిచా చద్ధా

Actor Richa Chadha's Galwan tweet: నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి భారత్ లో చేర్చడానికి భారతీయ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Actor Richa Chadha's Galwan tweet:రిచా రిప్లై పై నెటిజన్ల ఫైర్

నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ట్వీట్ కు స్పందనగా బాలీవుడ్ నటి రిచా చద్ధా ఒక ట్వీట్ చేశారు. ’గాల్వన్ సేస్ హాయ్(Galwan says hi) అని ఆ ట్వీట్ లో వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 2020లో చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో భారత, చైనా దళాల మధ్య హోరాహోరీ పోరాటం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో 20 మంది వరకు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా, పెద్ద సంఖ్యలో చైనా సైనికులు కూడా చనిపోయారు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ రిచా చద్ధా ఆ ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అమరులైన జవాన్లను, భారతీయ సైన్యాన్ని అవమానించారని ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు.

Hero Axay response: అక్షయ్ కుమార్ ఆగ్రహం

రిచా చద్ధా ట్వీట్ పై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ఆమె ట్వీట్ బాధాకరమని, సరిహద్దుల్లో సైన్యం ఉన్నారు కనుకనే, మనం స్వేచ్ఛగా, సంతోషంగా ఉండగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. మరోవైపు, భారతీయ సైన్యాన్ని అవమానించారని రిచాపై ముంబైలో కేసు నమోదైంది. బీజేపీ నేత, సినీ ప్రొడ్యూసర్ అశోక్ పండిట్ ఆమెపై జుహూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అది అవమానకరమైన ట్వీట్ అని, తక్షణమే దాన్ని తొలగించాలని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. రిచాపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని శివసేన(ఉద్ధవ్) నేత ఆనంద్ దూబే డిమాండ్ చేశారు.

Richa Chadha apologies: రిచా క్షమాపణలు

తన వివాదాస్పద ట్వీట్ పై నటి రిచా చద్ధా క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఆ ట్వీట్ చేయలేదని, సైన్యాన్ని అవమానించే ఆలోచన తనకు లేదని ఒక ప్రకటన చేశారు. సైన్యంలోని నా సోదరులను తెలియకుండానే అవమానించినందుకు బాధపడుతున్నానన్నారు. తన కుటుంబంలోనూ సైనికులున్నారని, తన తాత చైనాతో యుద్ధంలో పాల్గొన్నారని వెల్లడించారు.