తెలుగు న్యూస్  /  National International  /  5g Rollout In India, These Cities Will Be First To Get 5g Services

5G rollout : ఏపీకి ఇప్పట్లో ‘5జీ’ లేనట్టే.. ఈ నగరాల్లో త్వరలోనే సేవలు!

Sharath Chitturi HT Telugu

26 August 2022, 11:08 IST

    • 5G rollout in India : దేశంలో తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో.. ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఒక్క నగరం కూడా లేదు!
ఏపీలో ఇప్పట్లో ‘5జీ’ లేనట్టే.. ఈ నగరాల్లో త్వరలోనే సేవలు!
ఏపీలో ఇప్పట్లో ‘5జీ’ లేనట్టే.. ఈ నగరాల్లో త్వరలోనే సేవలు! (MINT_PRINT)

ఏపీలో ఇప్పట్లో ‘5జీ’ లేనట్టే.. ఈ నగరాల్లో త్వరలోనే సేవలు!

5G rollout in India : దేశంలో 5జీ సేవల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. 5జీ వేగం అనుభూతిని పొందాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దేశంలో వేగంగా 5జీ సేవలను తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బిడ్డింగ్​ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు.. దేశంలో 5జీ సేవలు అమల్లోకి వచ్చే నగరాలకు సంబంధించి ఒక నివేదిక బయటకి వచ్చింది. దేశంలోని 13 నగరాల్లో ఈ 5జీ సేవలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

అహ్మదాబాద్​, బెంగళూరు, ఛండీగఢ్​, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్​, గురుగ్రామ్​, హైదరాబాద్​, జామ్​నగర్​, కోల్​కతా, లక్నో, ముంబై, పుణెలో తొలుత.. త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఒక్క నగరం కూడా లేకపోవడం గమనార్హం. మహారాష్ట్రలో రెండు, గుజరాత్​ నుంచి రెండు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ఏపీ నుంచి ఒక్క నగరం కూడా లేదు.

5జీ సేవలు అందుబాటులోకి వచ్చే రెండో జాబితాలోనైనా ఏపీ ఉంటుందో లేదో చూడాలి.

అయితే.. తొలి జాబితాలోని 13 నగరాల్లో కూడా.. 5జీ సేవలు పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. తొలుత ఆయా నగరాల్లోని కొన్ని ప్రాంతాలకే ఈ 5జీ సేవలు పరిమితం అవుతాయని సమాచారం. ఆ ప్రాంతాల పేర్లు ఇంకా బయటకు రాలేదు.

కాగా.. రెండు- మూడేళ్లల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని టెలికాంశాఖ చెబుతోంది.

లాంచ్​ ఎప్పుడు?

5G latest news : 5జీ సేవల లాంచ్​పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెల 29న.. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వార్తలు బయటకి వస్తున్నాయి.

అయితే.. ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్​టెల్​ మాత్రం.. ఇంకొన్ని రోజుల్లోనే 5జీ సేవలు ప్రారంభిస్తాయని ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా.. రిలయన్స్​ జియో.. ఈ నెల 29 నుంచి 5జీని తన యూజర్లకు అందిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజు జరగనున్న రిలయన్స్​ ఏజీఎం(యానువల్​ జనరల్​ మీటింగ్​)లో.. ముకేశ్​ అంబానీ 5జీ సేవలను మొదలుపెట్టొచ్చని అంటున్నాయి.

Jio 5G : 5జీ సేవలను ముందుగా అమలు చేసేందుకు.. జియో- ఎయిర్​టెల్​ మధ్య గత కొంత కాలంగా తీవ్ర పోటీ నెలకొంది. మరి ఈ రెండు సంస్థల్లో ఏది మొదట 5జీ సేవలను తీసుకొస్తుందో వేచి చూడాలి.

<p>ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు..!</p>

Airtel 5G : 5జీ స్పెక్ట్రమ్​ వేలంలో అత్యధిక బిడ్లు వేసిన సంస్థగా జియో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. తమకు కావాల్సినన్ని బిడ్లు వేశామని, తాము వెనకబడలేదని ఎయిర్​టెల్​ చెబుతోంది.