Airtel 5G : 2024 మార్చ్​ నాటికి ప్రతి పట్టణంలో ఎయిర్​టెల్​ 5జీ!-airtel plans pan india 5g coverage by march 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Airtel 5g : 2024 మార్చ్​ నాటికి ప్రతి పట్టణంలో ఎయిర్​టెల్​ 5జీ!

Airtel 5G : 2024 మార్చ్​ నాటికి ప్రతి పట్టణంలో ఎయిర్​టెల్​ 5జీ!

Sharath Chitturi HT Telugu
Aug 10, 2022 07:52 AM IST

Airtel 5G : 2024 మార్చ్​ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రముఖ గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించనుంది ఎయిర్​టెల్​. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించినట్టు స్పష్టం చేసింది.

<p>2024 మార్చ్​ నాటికి ప్రతి పట్టణంలో ఎయిర్​టెల్​ 5జీ!</p>
2024 మార్చ్​ నాటికి ప్రతి పట్టణంలో ఎయిర్​టెల్​ 5జీ! (Bloomberg)

Airtel 5G : ఈ నెల చివర్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఎయిర్​టెల్​ ప్రకటించింది. 2024 మార్చ్​ నాటికి.. దేశవ్యాప్తంగా 5వేల పట్టణాలు, నగరాలకు 5జీ సేవలను విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎయిర్​టెల్​ సీఈఓ గోపాల్​ విట్టల్​ వెల్లడించారు.

"5జీని వెంటనే లాంచ్​ చేయాలని చూస్తున్నాము. పాన్​ ఇండియా స్థాయిలో త్వరలో లాంచ్​ ఉంటుంది. 2024 నాటికి.. ప్రతి పట్టణం, ప్రముఖ గ్రామీణ ప్రాంతాలను కవర్​ చేయాలని చూస్తున్నాము. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యాయి. మా సంస్థ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రణాళికగా నిలుస్తుంది," అని విట్టల్​ వెల్లడించారు.

5జీ సేవల విస్తరణపైనే సంస్థ ఎక్కువ దృష్టి పెట్టనుందని విట్టల్​ వెల్లడించారు. అందుకు తగ్గట్టుగా.. క్యాపిటల్​కు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.

5G in India : కాగా.. 5జీ ధరలను ఎయిర్​టెల్​ ఇంకా నిర్ణయించలేదని విట్టల్​ తెలిపారు. కానీ ఇప్పటికే అమల్లో ఉన్న ప్లాన్ల టారీఫ్​ను పెంచాల్సి ఉందని అన్నారు. క్యూ1లో ఎయిర్​టెల్​ ఆర్పూ రూ. 183గా ఉందని, త్వరలోనే అది రూ. 200, రూ. 300కి తీసుకెళతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. 5జీ సేవ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెలికాం సంస్థల ఆర్పూలో పెద్దగా మార్పులు జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

5జీ స్పెక్ట్రమ్​ వేలంలో ఎయిర్​టెల్​ వ్యూహాత్మకంగా అనుసరించిందని విట్టల్​ అన్నారు. అధిక ధరలు ఉండే 70ఎంహెచ్​జెడ్​ బదులు.. మిడ్​ బ్యాండ్​ స్పెక్ట్రమ్​ 30ఎంహెచ్​జెడ్​తో ప్రపంచస్థాయి 5జీ అనుభూతిని ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. 5జీ వేలం అనుకున్నట్టే జరిగిందని, అందువల్ల 5జీ సేవలపై సంస్థ మరింత ధీమాగా ఉందని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం