DoT gets 5G payment : ప్ర‌భుత్వానికి అందిన `5జీ` పేమెంట్‌-dot gets rs 17 876 cr from telecom operators as upfront payment for 5g spectrum ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dot Gets <Span Class='webrupee'>₹</span>17,876 Cr From Telecom Operators As Upfront Payment For 5g Spectrum

DoT gets 5G payment : ప్ర‌భుత్వానికి అందిన `5జీ` పేమెంట్‌

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 09:25 PM IST

5జీ స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించిన తొలి విడ‌త మొత్తం ప్ర‌భుత్వానికి అందింది. మొత్తం రూ. 17, 876 కోట్ల రూపాయ‌లు ఖ‌జానాకు చేరిన‌ట్లు కేంద్ర టెలీకాం శాఖ వెల్ల‌డించింది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

DoT gets 5G payment : భార‌త్‌లో ప్ర‌ధాన టెలీకాం సంస్థ‌లైన రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్‌, వీ(వొడాఫొన్ ఐడియా), ఆదానీ డేటా నెట్‌వ‌ర్క్స్ ఈ వేలంలో పాల్గొన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు స‌ర్కిళ్ల‌లో 5జీ స్పెక్ట్ర‌మ్‌ను సొంతం చేసుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

DoT gets 5G payment : 20 ఇన్‌స్టాల్‌మెంట్స్‌..

ఈ ఆక్ష‌న్‌లో అంగీక‌రించిన మొత్తాన్ని టెలీకాం సంస్థ‌లు 20 వార్షిక స‌మాన వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు. అయితే, భారతి ఎయిర్‌టెల్ మాత్రం మొద‌టి విడ‌త‌లోనే నాలుగు వాయిదాల మొత్తాన్ని చెల్లించింది. నాలుగు వార్షిక వాయిదాల‌కు గానూ ఎయిర్‌టెల్ ప్ర‌భుత్వానికి చెల్లించిన మొత్తం రూ. 8,312.4 కోట్లు. అలాగే, రిల‌య‌న్స్ జియో రూ. 7,864.78 కోట్ల‌ను, వొడాఫోన్ ఐడియా రూ. 1679.98 కోట్లు, ఆదానీ డేటా నెట్‌వ‌ర్క్స్ రూ. 18.94 కోట్ల‌ను చెల్లించాయి.

DoT gets 5G payment : 5జీ వేలం

దేశంలోనే అతిపెద్ద‌దైన టెలీకాం నెట్‌వ‌ర్క్ స్పెక్ట్ర‌మ్ వేలం ఇటీవ‌ల ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఆక్ష‌న్‌లో రూ. 1.5 ల‌క్ష‌ల కోట్ల విలువైన బిడ్ల‌ను టెలీకాం సంస్థ‌లు దాఖ‌లు చేశాయి. ఇందులో దాదాపు సగం, అంటే.. రూ. 87,946.93 కోట్ల విలువైన బిడ్ల‌ను రిల‌య‌న్స్ జియోనే దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే, తొలిసారి ఈ రంగంలో అడుగుపెడ్తున్న సంపన్న భార‌తీయుల్లో ఒక‌రైన‌ గౌత‌మ్ ఆదానీకి చెందిన ఆదానీ డేటా నెట్‌వ‌ర్క్స్ రూ. 211.86 కోట్ల విలువైన బిడ్ల‌ను దాఖ‌లు చేసింది. ఈ సంస్థ 400 MHz బ్యాండ్ విడ్త్ స్పెక్ట్ర‌మ్‌లో మాత్ర‌మే వేలంలో పాల్గొన్న‌ది. భార‌తి ఎయిర్‌టెల్ రూ. 43,039.63 కోట్లు, వొడాఫొన్ ఐడియా రూ. 18,786.25 కోట్ల‌కు బిడ్ వేశాయి.

IPL_Entry_Point