5G smartphone : మీ స్మార్ట్​ఫోన్..​ '5జీ'కి సపోర్ట్​ చేస్తుందా? ఇలా చెక్​ చేసుకోండి..-is your smartphone 5g enabled follow these steps to find out ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Is Your Smartphone 5g-enabled? Follow These Steps To Find Out

5G smartphone : మీ స్మార్ట్​ఫోన్..​ '5జీ'కి సపోర్ట్​ చేస్తుందా? ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Aug 20, 2022 11:00 AM IST

5G smartphone : మీ స్మార్ట్​ ఫోన్​కి 5జీ సపోర్ట్​ ఉందా? లేదాా కొత్తది కొనుగోలు చేసుకోవాలా? ఇలా చెక్​ చేసుకోండి..

మీ స్మార్ట్​ఫోన్​ 5జీకి సపోర్ట్​ చేస్తుందా? ఇలా చెక్​ చేసుకోండి..
మీ స్మార్ట్​ఫోన్​ 5జీకి సపోర్ట్​ చేస్తుందా? ఇలా చెక్​ చేసుకోండి.. (via REUTERS)

5G smartphone : ఇప్పుడు దేశమంతా 5జీ కోసం ఎదురుచూస్తోంది! అందుకు తగ్గట్టుగానే.. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను తీసుకొచ్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. 5జీ స్పెక్ట్రమ్​ వేలంలో.. బిడ్డింగ్​ ప్రక్రియ కూడా ముగిసింది. అంతా బానే ఉంది కానీ.. మన స్మార్ట్​ఫోన్​.. 5జీకి సపోర్ట్​ చేస్తుందా? లేదా కొత్తది తీసుకోవాలా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కొత్తది తీసుకునేముందు.. ఒకసారి ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్​ఫోన్​లో 5జీ సపోర్టు ఉందా, లేదా అన్న తెలుసుకోవడం ఉత్తమం.

మీ స్మార్ట్​ఫోన్​.. 5జీకి సపోర్ట్​ చేస్తుందా?

  • ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లో ముందుగా సెట్టింగ్స్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 1 :- 'వైఫై అండ్​ నెట్​వర్క్​' ఆప్షన్​ను ఎంచుకోండి.
  • స్టెప్​ 2 :- 'సిమ్​ అండ్​ నెట్​వర్క్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 3 :- 'ప్రిఫర్డ్​ నెట్​వర్క్​'లో.. అన్ని టెక్నాలజీలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
  • స్టెప్​ 4 :- మీ స్మార్ట్​ఫోన్​కి 5జీ సపోర్టు ఉంటే.. అందులో 2G/3G/4G/5G అని కనిపిస్తుంది.

యాపిల్​ ఐఫోన్​లో ఇలా..

5g settings iPhone : యాపిల్​ ఐఫోన్​లో సెట్టింగ్స్​ మీద క్లిక్​ చేయండి.

  • సెల్యులర్​/ మొబైల్​ డేటా మీద క్లిక్​ చేయండి.
  • స్క్రీన్​ మీద.. డేటా రోమింగ్​, వాయిస్​ అండ్​ డేటా, డేటా మోడ్​ వంటి ఆఫ్షన్లు కనిపిస్తుంటే.. మీ యాపిల్​ ఫోన్​లో 5జీ సేవలు వస్తాయి.

భారతీయుల ఎదురుచూపులు..

89శాతం మంది భారతీయులు.. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. వారందరు 5జీకి అప్డేట్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది.

నెట్​వర్క ఇంటెలిజెన్స్​ సంస్థ ఓక్లా.. ఈ సర్వే చేపట్టింది. 4జీ కన్నా.. 5జీ 10రెట్లు వేగంగా కనెక్టివిటీని అందించినా.. ధరలు, కవరేజీ, వినియోగం వంటివి తొలి దశలో సవాళ్లుగా మారతాయని అభిప్రాయపడింది.

5G in India : "5జీ ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. సర్వేలో పాల్గొని, 5జీకి అప్డేట్​ అవ్వము అని చెప్పివారిలో 25శాతం మంది.. ధరల గురించే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. మరో 24శాతం మంది 5జీపై అవగాహన లేకపోవడంతో అప్డేట్​ అవ్వము అని అన్నారు. ఇక 23శాతం మంది.. తమ వద్ద 5జీ ఫోన్​ లేని కారణంగా అప్డేట్​ అవ్వమని తేల్చారు," అని ఓక్లా సర్వే స్పష్టం చేసింది.

ఏదేమైనప్పటికీ.. 89శాతం మంది భారతీయులు 5జీ పట్ల కుతుహలంగా ఉన్నారు. వారిలో 70శాతమంది.. వీడియో స్ట్రీమింగ్​ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. 68శాతం మంది.. మొబైల్​ గేమింగ్​లో వేగం పెరుగుతుందని 5జీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు వివరించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం