5G services in India : నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు- టెలికాం శాఖ ప్రకటన!-5g services in india likely to be rolled out within a month says mos telecom today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5g Services In India : నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు- టెలికాం శాఖ ప్రకటన!

5G services in India : నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు- టెలికాం శాఖ ప్రకటన!

Sharath Chitturi HT Telugu
Aug 08, 2022 04:05 PM IST

5G services in India : 5జీ సేవలు నెల రోజుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండొచ్చని టెలికాం శాఖ తెలిపింది.

నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు.. టెలికాం శాఖ ప్రకటన
నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు.. టెలికాం శాఖ ప్రకటన (HT_PRINT)

5G services in India : దేశవ్యాప్తంగా 5జీ సేవలు నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్​ సోమవారం వెల్లడించారు. ఇంటర్నేషనల్​ టెలికమ్యూనికేషన్​ యూనియన్స్​ రీజనల్​ స్టాండర్​డైజేషన్​ ఫోరం(ఆర్​ఎస్​ఎఫ్​) ఫర్​ ఏషియా అండ్​ ఓషనిక్​ రీజియన్​ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"నెల రోజుల్లో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా వివిధ రంగాల అభివృద్ధిలో 5జీ ప్రభావం చూపిస్తుంది. 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్​ గ్రూప్​ని కూడా ఏర్పాటు చేశాము. దేశీయ 6జీ స్టాక్​ అభివృద్ధి కోసం ఆ బృందం కృషిచేస్తోంది. 5జీ టెస్ట్​ బెడ్​ని మా సొంతంగా తయారు చేసుకున్నాము. 5జీ నెట్​వర్క టెస్టింగ్​కు అది ఉపయోగపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ స్టాక్​ని ప్రవేశపెడతాము. ఇది 5జీ నెట్​వర్క్​కు ఉపయోగపడుతుంది," అని దేవుసిన్హ అన్నారు.

అంతేకాకుండా.. సెప్టెంబర్​ 29న.. 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.

5జీ కోసం జరిగిన వేలం ఇటీవలే ముగిసింది. మొత్తం మీదు రూ. 1.5లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. వీటిల్లో జియో వేసిన బిడ్లే ఎక్కువగా ఉన్నాయి.

ప్రజల ఎదురుచూపులు..

5G network : దేశంలో 5జీ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం.. 89శాతం మంది భారతీయులు.. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారందరు 5జీకి అప్డేట్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

సర్వేలోని పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం