తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Landslide Hits Campsite In Malaysia: కొండ చరియలు విరిగిపడి 16 మంది దుర్మరణం

Landslide hits campsite in Malaysia: కొండ చరియలు విరిగిపడి 16 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu

17 December 2022, 17:27 IST

  • Landslide hits campsite in Malaysia: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక క్యాంప్ సైట్ లో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలొ కొనసాగుతున్న సహాయ చర్యలు
ఘటనాస్థలిలొ కొనసాగుతున్న సహాయ చర్యలు (AP)

ఘటనాస్థలిలొ కొనసాగుతున్న సహాయ చర్యలు

Landslide hits campsite in Malaysia: కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక క్యాంప్ సైట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆ పర్వత పాదం వద్ద దాదాపు 95 మంది వరకు ఉన్నారు. వారంతా మలేసియన్లేనని ప్రాథమిక సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Landslide hits campsite in Malaysia: ఇంకా చాలా మంది మిస్సింగ్

మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో ఉన్న బటంగ్ కాలి వద్ద ఉన్న ఒక పర్యాటక వ్యవసాయ క్షేత్రంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 16 మృతదేహాలను వెలికి తీశారు. సుమారు 25 మంది ఇంకా శిధిలాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి సహాయ సిబ్బంది 53 మందిని కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలి కౌలాలంపూర్ కు 51 కిమీల దూరంలో ఉంది.

Landslide hits campsite in Malaysia: క్యాంప్ సైట్

ఘటన జరిగిన ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రాంతం. అక్కడి సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో పర్యాటకులు క్యాంప్స్ వేసుకుని సమయం గడుపుతుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కౌలాలంపూర్ నుంచి పిల్లలతో కలిసి కుటుంబాలు ఇక్కడ రాత్రి బస చేయడం కోసం వస్తుంటాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి కొండ చరియలు విరిగిపడ్డాయి. రాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దంతో కొండచరియలు విరిగిపడడం ప్రారంభమవడంతో.. ఆ శబ్దానికి మేలుకున్న కొందరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ప్రత్యక్ష సాక్షి లియాంగ్ జిమ్ మెంగ్ తెలిపారు. తామున్న టెంట్ పై కూడా భారీగా మట్టి పేరుకుపోయిందని, ఏదో విధంగా బయటపడ్డామని వివరించారు. తాము సురక్షిత ప్రదేశానికి వచ్చిన తరువాత మరో పెద్ధ శబ్దంతో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని వెల్లడించారు.

టాపిక్