తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Minor Girl Raped And Killed: 10 ఏళ్ల బాలికపై హత్యాచారం; నిందితుడు కూడా మైనరే

Minor girl raped and killed: 10 ఏళ్ల బాలికపై హత్యాచారం; నిందితుడు కూడా మైనరే

HT Telugu Desk HT Telugu

29 November 2022, 21:45 IST

    • Minor girl raped and killed: 10 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. మొబైల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడిన ఒక మైనర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పదేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బెమటార జిల్లాలో జరిగింది. పొరుగింట్లో ఉండే 10 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల మైనర్ లైంగిక దాడి చేసి, ఆ పై గొంతు నులిమి చంపేశాడు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Minor girl raped and killed: ఇంట్లోనే నిర్జీవంగా..

ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మొదట ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావించారు. కానీ, పోస్ట్ మార్టం నివేదికలో మరణానికి ముందు, లైంగిక దాడి జరిగినట్లుగా, అలాగే, గొంతు నులిమినట్లుగా తేలింది. దాంతో, పోలీసులు రేప్, మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Minor girl raped and killed: పోర్న్ కు బానిసై..

అనుమానంతో ఆ బాలిక పక్కింట్లో ఉండే 17 ఏళ్ల మైనర్ ను, మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఆ మైనర్ అంగీకరించాడు. మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడడానికి అలవాటు పడ్డానని పోలీసులకు వివరించాడు. అలాగే, ఆ రోజు మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోను చూసి ఈ నేరం చేశానని వివరించాడు. అత్యాచారం చేసిన మీదట, ఆ బాలిక ఈ విషయాన్ని అందరికీ చెబుతుందన్న భయంతో గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. అనంతరం, ఆ మృతదేహాన్ని అక్కడి స్తంభానికి వేలాడదీశానని తెలిపాడు. పోలీసులు ఆ మైనర్ పై ఐపీసీ(IPC), పొక్సొ (POCSO) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.