తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coal Mine Explosion: బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది కార్మికులు మృత్యువాత‌!

Coal Mine Explosion: బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది కార్మికులు మృత్యువాత‌!

HT Telugu Desk HT Telugu

09 December 2022, 20:02 IST

  • 10 Dead in Coal Mine Explosion: ఇండోనేషియాలోని ఓ మైనింగ్ గనిలో పేలుడు సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బొగ్గు గనిలో పేలుడు(represntative image)
బొగ్గు గనిలో పేలుడు(represntative image) (HT)

బొగ్గు గనిలో పేలుడు(represntative image)

Indonesia Coal Mine Explosion: ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

ఖనిజాలు అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి సరైన భద్రతా పరికరాలను ఉపయోగించకుండా ఉండటమే ఇందుకు కారణం. ఇదే ఏడాది సెప్టెంబర్ లో బోర్నియో ద్వీపంలో జరిగిన పేలుడు ఘటనలోనూ ఏడుగురు మృతి చెందారు. ఏప్రిల్ లోనూ ఉత్తర సమత్రా ఫ్రావిన్స్ లోనూ బంగారు గనిలో పేలుడు సంభవించి 12 మంది దుర్మరణం చెందారు.