తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Differences : ఎక్కువ నిద్ర ఎవరికి కావాలి? స్త్రీలకా? పురుషులకా?

Sleeping Differences : ఎక్కువ నిద్ర ఎవరికి కావాలి? స్త్రీలకా? పురుషులకా?

HT Telugu Desk HT Telugu

21 February 2023, 20:00 IST

google News
    • Sleeping Differences : స్త్రీ పురుషులలో ఎక్కువసేపు ఎవరు నిద్రపోతారు. ఇంతకీ ఎక్కువ నిద్ర ఎవరికి అవసరం.. మహిళలకా? పురుషులకా?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర అందరికీ అవసరం. నిద్ర(Sleep) సరిగా పోతేనే.. ఆరోగ్యం. నిద్ర మన శ్రేయస్సును నిర్ణయించే అత్యంత అనివార్యమైన అంశం. మంచి నిద్ర మన శరీరాన్ని రీఛార్జ్ చేయడం మాత్రమే కాకుండా, అనేక అనారోగ్యాలను దూరం చేస్తుంది. కానీ, చాలా సమయాల్లో పని షెడ్యూల్‌లు, జీవనశైలి(Lifestyle)లో మార్పులు, అస్థిరమైన ఆహారపు అలవాట్ల(Food Habits) కారణంగా నిద్ర ఖచ్చితంగా అందరికీ సులభంగా రాదు. కానీ మీ నిద్రతోనే మీ ఆరోగ్యం(Health). అయితే స్త్రీలు ఎక్కువ నిద్ర పోవాలా? పురుషులు ఎక్కువ పోవాలా?

రోజుకు ఎనిమిది గంటలు(8 Hours Sleep) నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట. అయితే నేటి ఆధునిక జీవన విధానం, అలవాట్లు, పని ఒత్తిడి.. ఇలా అనేక కారణాలతో కంటినిండా నిద్ర అనేది కరవు అయిపోయింది. మహిళలు ఇంటి పనులు కోసం త్వరగా లేస్తారు. అంతేకాదు.. మహిళలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఓ వైపు ఇంటి పని, మరోవైపు ఆఫీసు పని(Office Work).. దీంతో మహిళల్లో తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతుంది. కంటి నిండా నిద్రపోవడం మరచిపోతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

అయితే పురుషులు(men's), స్త్రీల మధ్య జీవన విధానాన్ని అనుసరించి.. నిద్ర అవసరాల్లో మార్పులు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులు, మహిళలు తమ రోజను ఎలా గడుపుతారని పరిశోధనలు చేశారు. దీనిని నిద్ర మీద అనాలసిస్ చేశారు. ఇందులో స్త్రీలకు పురుషులకంటే.. ఎక్కువ నిద్ర అవసరమని కనుగొన్నారు. ప్రతి దశలో హార్మోన్ల మార్పులతో స్త్రీలు(Women's) తమ నిద్రను కోల్పోతారు. అందుకోసమే.. పురుషులతో పోలిస్తే.. మహిళలకు మరో అరగంట నిద్ర ఎక్కువ అవసరం.

మహిళలు తగినంత నిద్ర లేకపోయినా.. బరువు త్వరగా పెరుగుతారు. దీనితో కార్టిసాలల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. దీనితో ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. మహిళలు నిద్రలేమితో హార్మోన్లలో తీవ్ర మార్పులు ఉంటాయి. దీనితో అనేక సమస్యలు వస్తాయి. గర్భం సమస్యలు, రుతు క్రమంలో ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఆందోళన, నిరాశ ఉంటాయి.

మరోవైపు పురుషులు, స్త్రీల నిద్ర విధానాల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. నిద్ర మొదటి మూడు దశలు నాన్-రాపిడ్ ఐ మూమెంట్ (NREM) నిద్రగా పరిగణిస్తారు. వీటిలో మొదటి రెండు దశలు తేలికపాటి నిద్ర, మూడవ దశ గాఢ నిద్ర. ఈ దశలు పురుషులు మరియు స్త్రీలలో భిన్నంగా ఉంటాయి. పురుషుల కంటే మహిళలు మూడో దశ గాఢ నిద్రలో ఎక్కువ సమయం గడుపుతారు. మొదటి దశలో తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అయితే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువసేపు నిద్రపోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ అరగంటపైనే స్త్రీలకు నిద్ర ఎక్కువగా ఉంటే మంచిదట.

తదుపరి వ్యాసం