Men's Attraction : ఆ కాలంలో స్త్రీలను పురుషులు ఎక్కువ ఆకర్షణతో చూస్తారట-men find women s bodies more attractive in winter details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men's Attraction : ఆ కాలంలో స్త్రీలను పురుషులు ఎక్కువ ఆకర్షణతో చూస్తారట

Men's Attraction : ఆ కాలంలో స్త్రీలను పురుషులు ఎక్కువ ఆకర్షణతో చూస్తారట

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 08:53 PM IST

Women's Bodies More Attractive In Winter : స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఆకర్షణగా అనిపిస్తే.. చాలు దొంగచాటుగానైనా చూస్తారు. అయితే స్త్రీల శరీరాన్ని ఆకర్షణగా పురుషులు ఏ కాలంలో ఎక్కువగా చూస్తారో తెలుసా? ఓ అధ్యయనం ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

స్త్రీ, పురుషుల మధ్య ఇష్టం ఎప్పుడూ.., ఎలా కలుగుతుందో తెలియదు. అయితే కొన్ని ఇష్టలు ఆకర్షణ వరకు మాత్రమే ఉంటాయి. ఎలాగైనా చూడాలని ఇంట్రస్ట్ కొంతమందికి ఉంటుంది. అయితే కాలాన్ని బట్టి కూడా.. స్త్రీల శరీరాన్ని(Women Body) పురుషులు ఆకర్షణతో చూస్తారట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

పోలాండ్‌లోని వ్రోక్లా యూనివర్శిటీకి చెందిన ఒక బృందం ఈ అధ్యయనాన్ని గతంలో నిర్వహించింది. పురుషులు నిజానికి శీతాకాలంలో(Winter Season) స్త్రీల శరీరాలను మరింత ఆకర్షణీయంగా చూస్తారని కనుగొన్నారు. కాలానుగుణ వైవిధ్యానికి స్పష్టమైన వివరణ లేనప్పటికీ, ఒక సిద్ధాంతం ఏంటంటే శీతాకాలంలో స్త్రీలు శరీరాలను తక్కువ ప్రదర్శిస్తారు. దీంతో అరుదుగా చూసే అవకాశం ఉంటుందని, మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుందని అధ్యయనం చెబుతుంది. అలా శీతాకాలంలో మహిళల శరీరాన్ని చూసేందుకు పురుషులు చాలా ఇంట్రస్ట్ తో ఉంటారని తెలిసింది.

సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో మహిళల ఫోటోలకు రేటింగ్(Rating) ఇవ్వమని కొంతమంది పురుషుల(Men's)పై అధ్యయనం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. ప్రతి సీజన్ కు తగ్గట్టుగా దుస్తులు వేసిన మహిళల ఫొటోలను ఇందులో పురుషుల ముందు షేర్ చేశారు. నల్లటి స్విమ్‌సూట్‌లలో ఉన్న మహిళల పూర్తి శరీర చిత్రాలు, వివిధ పరిమాణాల బహిర్గతమైన రొమ్ములు, యువతుల ముఖాలను కూడా చూపించారు.

చలికాలంలో, వింటర్ సమ్మర్ మధ్య వచ్చే రోజుల్లో శరీరాలు, రొమ్ములు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, వేసవిలో తక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయని ఫలితాలు వెల్లడించాయి. మహిళల ముఖాలు ఏడాది పొడవునా వీక్షించేలా ఉండవచ్చని రేటింగ్‌లు చెప్పాయి. ఇందులో కాలానుగుణ వైవిధ్యం లేదు.

తమ సొంత భాగస్వామిని ఎంత ఆకర్షణీయంగా చూశారో పరిశోధకులు పరీక్షించారు. చలికాలంలో గరిష్ట స్థాయితో కాలానుగుణంగా.. పైన చెప్పినట్టుగా ఎక్కువగా చూస్తున్నారు. అదే రేటింగ్ చూపించాయి. వేసవి(Summer)లో కంటే పురుషులు చలికాలంలోనే ఎక్కువగా స్త్రీల శరీరాలను చూస్తారని తెలిసింది. ఊహించినట్లుగా, శరీరం, రొమ్ము ఆకర్షణ రేటింగ్‌లు శీతాకాలంలో కంటే వేసవిలో తక్కువగా ఉన్నాయి. ఈ పరిశోధనలు పర్సెప్షన్ జర్నల్ యొక్క ఎడిషన్‌లో గతంలో ప్రచురించారు.

Whats_app_banner