DIY Air Filter । ఎయిర్ ఫిల్టర్‌లు గాలిలోని కరోనా వైరస్‌లను నిర్మూలించగలవు, పరిశోధనలో వెల్లడి!-diy air filter corsi rosenthal can effectively filter out covid viruses air pollutants says study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Air Filter । ఎయిర్ ఫిల్టర్‌లు గాలిలోని కరోనా వైరస్‌లను నిర్మూలించగలవు, పరిశోధనలో వెల్లడి!

DIY Air Filter । ఎయిర్ ఫిల్టర్‌లు గాలిలోని కరోనా వైరస్‌లను నిర్మూలించగలవు, పరిశోధనలో వెల్లడి!

Manda Vikas HT Telugu
Dec 27, 2022 03:10 PM IST

DIY Air Filter Corsi-Rosenthal Box: కరోనా వైరస్ లతో పాటు గాలిలోని రసాయన కారకాలను ఎయిర్ ఫిల్టర్లు శుద్ధి చేస్తున్నట్లు రుజువైంది. కోర్సి-రోసెంతల్ ఎయిర్ ప్యూరీఫైయర్లను మీకు మీరుగా చేసుకోవచ్చు.

DIY Air Filter - Corsi-Rosenthal Box to filter out covid viruses
DIY Air Filter - Corsi-Rosenthal Box to filter out covid viruses (Wikimedia/Pixabay)

ఉన్నట్లుండి మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. చైనాలో అకస్మాత్తుగా కోట్ల కొలదీ పెరిగిన కేసులతో ప్రపంచంలోని మిగతా దేశాలు అప్రమత్తమయ్యాయి. భారతదేశంలోనూ సరికొత్త వేరియంట్ Omicron BF.7 కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా కోవిడ్ వైరస్ పరిణామంతో, సంక్రమణకు సంబంధించిన లక్షణాలు కూడా గణనీయంగా మారాయి. ఇదివరకు రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కోవిడ్‌కి సంబంధించిన సూచనలు. అయితే ఇటీవల కాలంలో ప్రజలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు గొంతు నొప్పి, తుమ్ములు, ప్రేగు సంబంధిత అనారోగ్యం గురించి ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న అత్యంత ప్రబలమైన వేరియంట్ కాబట్టి, ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్టులు చేసుకోవాలని, ఇన్ఫెక్షన్ సోకకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

DIY Air Filter Eliminates Viruses- ఎయిర్ ఫిల్టర్‌లతో వైరస్‌ల నివారణ

కోవిడ్ నివారణకు మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించటం మనకు తెలిసిందే, ఇప్పుడు కొత్తగా ఎయిర్ ఫిల్టర్లు కూడా కోవిడ్‌ను నిరోధించగలవని నిర్ధారణ అయింది. తాజా అధ్యయనం ప్రకారం, సులభంగా తమకు తాముగా తయారు చేసుకోగలిగే ఎయిర్ ఫిల్టర్‌ (DIY Air Filter)లు వైరస్‌ల వల్ల మాత్రమే కాకుండా రసాయన కాలుష్యాల వల్ల కూడా వచ్చే అనారోగ్యం నుండి కాపాడుతాయి.

యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జోసెఫ్ బ్రౌన్ బృందం ఈ అధ్యయనం చేపట్టారు. వారి పరిశోధనలో కోర్సి-రోసెంతల్ బాక్స్‌లు లేదా క్యూబ్స్ అనే ఫిల్టర్‌లు వైరస్‌లను, అలాగే గాలిలోని రసాయన కాలుష్య కారకాలను సమర్థవంతంగా వాతావరణంలో నుంచి నిర్మూలించగలవని గుర్తించారు.

What is Corsi-Rosenthal Box - ఏమిటి ఈ కోర్సి-రోసెంతల్ బాక్స్‌?

కోర్సి-రోసెంతల్ బాక్స్ అనేది గాలిని శుద్ధి చేసే ఒక ఫిల్టర్. దీనిని కోర్సి-రోసెంతల్ క్యూబ్ లేదా కంపారెట్టో క్యూబ్ అని కూడా పిలుస్తారు. ఇది మీకు మీరుగా తయారు చేసుకోగలిగే ఒక చవకైన ఎయిర్ ప్యూరిఫైయర్. COVID-19 మహమ్మారి సమయంలో ఇండోర్ సెట్టింగ్‌లలో గాలిలో వైరల్ కణాల స్థాయిలను తగ్గించే లక్ష్యంతో దీనిని రూపొందించడమైనది.

How To Make Corsi-Rosenthal Box- ఎలా తయారు చేయవచ్చు?

కోర్సి-రోసెంతల్ ఎయిర్ ఫిల్టర్‌ను హార్డ్‌వేర్ స్టోర్‌లలో లభించే కొన్ని వస్తువులతో నిర్మించవచ్చు, ఇందుకోసం మీకు నాలుగు MERV-13 ఫిల్టర్‌లు, డక్ట్ టేప్, 20-అంగుళాల బాక్స్ ఫ్యాన్ అలాగే ఒక కార్డ్‌బోర్డ్ చెక్క పెట్టె అవసరం అవుతుంది.

ఇవి తయారు చేసి గదులలో ఉంచడం వలన గాలిని శుద్ధి చేస్తాయి. బ్రౌన్ బృందం చేసిన పరిశోధనల ప్రకారం. కోర్సి-రోసెంతల్ బాక్స్‌లు ఉపయోగించిన 17 గదులలో అనేక PFAS , థాలేట్‌ల సాంద్రతలను గణనీయంగా తగ్గాయి. PFAS, క్లీనర్‌లు, టెక్స్‌టైల్స్ , వైర్ ఇన్సులేషన్‌లలో ఉత్పత్తి అయ్యే సింథటిక్ రసాయనాలు కనీసం 40 నుండి 60 శాతం వరకు తగ్గాయి.

కోవిడ్ మహమ్మారి సమయంలో వైరస్ లను ఫిల్టర్ చేయడానికి ఈ పెట్టెలు ప్రభావవంతగా ఉంటాయని అంటున్నారు. వాయు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో కూడా ఈ ఎయిర్ ఫిల్టర్లు అద్భుతమైనవి అని ఈ బాక్సుల ఆవిష్కర్తలలో ఒకరైన రిచర్డ్ కోర్సి అన్నారు.

అయితే బాక్స్ ఫిల్టర్‌లు వాయు కాలుష్యం తగ్గిస్తాయి కానీ ఇవి నడిచేటపుడు కొంత శబ్దం చేస్తాయి. నిశబ్దంగా ఉండాల్సిన చోట ఇవి అనుకూలమైనవి కాకపోవచ్చు అని చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం